News March 18, 2025
వరంగల్: రైలు తగిలి తెగిపడ్డ చేయి

రైలు తగిలి చేయి తెగిపడ్డ ఘటన వరంగల్ రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. వరంగల్ రామన్నపేటకు చెందిన నరసింహ (50) వరంగల్ రైల్వే స్టేషన్లో ఒకటో నంబర్ ప్లాట్ ఫాంపై నిలుచున్నాడు. అప్పుడే వచ్చిన జైపూర్ ఎక్స్‌ప్రెస్ అతడికి తగలడంతో చేయి తెగి పడింది. వెంటనే రైల్వే సిబ్బంది 108కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది, ప్రథమ చికిత్స అందించి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 18, 2025
50 ఏళ్లకే పెన్షన్‌పై మంత్రి కీలక ప్రకటన

AP: పెన్షనర్ల తగ్గింపు, 50 ఏళ్లకే పెన్షన్ హామీపై YCP MLCలు మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే ₹4వేల చొప్పున పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. గత ప్రభుత్వం ₹వెయ్యి పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు టైమ్ తీసుకుంటే మేం రాగానే ₹1,000 పెంచాం. ప్రస్తుతం అనర్హుల పెన్షన్లనే తొలగిస్తున్నాం’ అని తెలిపారు.
News March 18, 2025
బాక్సాఫీస్ సమరానికి సిద్ధమైన అన్నదమ్ములు?

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే, ఇదేరోజున మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘భైరవం’ కూడా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోందని సినీవర్గాలు తెలిపాయి. ఇప్పటికే పరస్పర ఘర్షణలతో అన్నదమ్ములు వార్తల్లో నిలుస్తుండగా ఒకేరోజు రిలీజైతే మంచు ఫ్యామిలీలో గొడవలు పెరిగే అవకాశం ఉంది. ఒకేరోజు వస్తే మీరు ఏ సినిమాకు వెళ్తారు?
News March 18, 2025
శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీపై రాజు మాట్లాడుతూ.. అది ఫోర్త్ సిటీ కాదు.. ఫోర్ బ్రదర్స్ సిటీ అనడంతో శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. అయితే దీనిపై రాజు స్పందిస్తూ.. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్ష పార్టీకి ఒక న్యాయమా అంటూ విమర్శించారు.