News March 18, 2025

NGKL: చెరువులో పడి మహిళ మృతి

image

ఓ మహిళ చెరువులో పడి మృతిచెందిన ఘటన ఈ నెల 16న చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. తెలకపల్లి మండలానికి చెందిన చంద్రమ్మ(35) కొంత కాలంగా మద్యానికి బానిసైంది. కుటుంబ సభ్యులు ఎంతచెప్పినా పట్టించుకోలేదు. గ్రామ శివారులో ఉన్న పెద్దచెరువు దగ్గరికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడింది. ఈత రాకపోవటంతో మృతిచెందింది. ఈ మేరకు కేసునమోదైంది.

Similar News

News September 19, 2025

పోలీస్ కస్టడీకి మిథున్ రెడ్డి.. విజయవాడకు తరలింపు

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విజయవాడకు తరలించారు. ఆయన్ను 5 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరగా కోర్టు 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన్ను అధికారులు ఇవాళ, రేపు విచారించనున్నారు. ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్న విషయం తెలిసిందే.

News September 19, 2025

గజ్వేల్: కొమ్మ కొమ్మకో గూడు..

image

గజ్వేల్‌లో ఈత చెట్టు కొమ్మలకు ఉన్న గూళ్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పక్షులు అద్భుత నైపుణ్యంతో కట్టుకున్న ఈ గూళ్లు వద్ద సందడి చేస్తున్నాయి. ఈ దృశ్యం పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం ఆవశ్యకతను గుర్తుచేస్తుంది. గజ్వేల్ పట్టణం నుంచి సంగాపూర్ వెళ్లే దారిలో గజ్వేల్ బాలికల విద్యాసౌధం సమీపంలో ఈత చెట్టు కొమ్మలకు పక్షులు కట్టుకున్న గూళ్లు కనువిందు చేస్తున్నాయి.

News September 19, 2025

దర్శి: విద్యార్థి మృతి.. బస్సుల నిలిపివేత

image

దర్శి మండలం తూర్పు చౌటపాలెంలో నిన్న రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వెళ్తున్న ముగ్గురిని ఓ స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో చౌటపాలేనికి చెందిన ఇంటర్ విద్యార్థి యేసురాజు(17) మృతిచెందాడు. దీంతో ఇవాళ ఉదయం గ్రామానికి వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సులను ఎస్సీ కాలనీవాసులు అడ్డుకున్నారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగే వరకు బస్సులను గ్రామం నుంచి పంపించబోమన్నారు.