News March 18, 2025

కుబీర్: కరెంట్ షాక్‌తో రైతు మృతి

image

ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ వివరాల ప్రకారం.. సిర్పెల్లి(H) గ్రామానికి చెందిన పబ్బు గణేశ్(48) సోమవారం వ్యవసాయ భూమిలో మొక్కజొన్నకు నీరు ఇవ్వడానికి వెళ్లాడు. ఇంటికి రాలేదని తన కుమారుడు వెళ్లి చూడగా కరెంట్ షాక్‌కు గురై గణేశ్ విగతజీవిగా పడి ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.

Similar News

News March 19, 2025

చిన్నారులపై స్పెషల్ ఫోకస్: మహబూబ్‌నగర్ కలెక్టర్ 

image

శిశు గృహాల్లో ఉన్న చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నామని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌కు చెందిన ఫెర్నాండెజ్ ఫౌండేషన్, జీజీహెచ్ వైద్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. చిన్నారులు ఇంటి వాతావరణం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. శిశు గృహాల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు.

News March 19, 2025

సునీతా విలియమ్స్ కోసం ప్రత్యేక పూజలు

image

సునీతా విలియమ్స్ క్షేమంగా భూమిమీదకు చేరుకోవాలని గుజరాత్‌లోని ఝాలసన్‌లో ఆమె పూర్వీకులు పూజలు నిర్వహించారు. సునీతా భూమి మీదకు రాకకోసం కుటుంబమంతా ఎదురుచూస్తుందని తన సోదరుడు తెలిపారు. ఆమె క్షేమంగా చేరుకోవాలని ప్రత్యేకంగా యజ్ఞం చేశామన్నారు. భారత్ సంతతికి చెందిన సునీతా విలియమ్స్ గతేడాది అంతరిక్షంలో చిక్కుకుంది. 9నెలల తర్వాత నేడు వ్యోమనౌకలో భూమి మీదకు రానుంది.

News March 19, 2025

సీఎం చంద్రబాబుని కలసిన మాగుంట

image

ఢిల్లీ విచ్చేసిన సీఎం చంద్రబాబు నాయుడిని విమానాశ్రయంలో మంగళవారం ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఇటీవల ఎంపీ మాగుంట చెన్నైలో గుండెకు శాస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసి మాగుంట ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీలు పాల్గొన్నారు.

error: Content is protected !!