News March 18, 2025
హౌతీల వల్ల నెలకు 800 మిలియన్ డాలర్ల నష్టం: ఈజిప్ట్

సూయజ్ కెనాల్‌లో నౌకల్ని హౌతీ రెబెల్స్ అడ్డుకుంటుండటం వల్ల తమకు నెలకు 800 మిలియన్ డాలర్ల నష్టం వస్తోందని ఈజిప్ట్ అధ్యక్షుడు సిసీ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది 7 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. కాగా.. యెమెన్‌లోని హౌతీలపై అమెరికా ముమ్మర దాడుల్ని కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే 24మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. వారిలో 9మంది పౌరులున్నారని యెమెన్ ఆరోగ్యశాఖ చెబుతోంది.
Similar News
News March 18, 2025
50 ఏళ్లకే పెన్షన్‌పై మంత్రి కీలక ప్రకటన

AP: పెన్షనర్ల తగ్గింపు, 50 ఏళ్లకే పెన్షన్ హామీపై YCP MLCలు మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే ₹4వేల చొప్పున పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. గత ప్రభుత్వం ₹వెయ్యి పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు టైమ్ తీసుకుంటే మేం రాగానే ₹1,000 పెంచాం. ప్రస్తుతం అనర్హుల పెన్షన్లనే తొలగిస్తున్నాం’ అని తెలిపారు.
News March 18, 2025
బాక్సాఫీస్ సమరానికి సిద్ధమైన అన్నదమ్ములు?

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే, ఇదేరోజున మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘భైరవం’ కూడా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోందని సినీవర్గాలు తెలిపాయి. ఇప్పటికే పరస్పర ఘర్షణలతో అన్నదమ్ములు వార్తల్లో నిలుస్తుండగా ఒకేరోజు రిలీజైతే మంచు ఫ్యామిలీలో గొడవలు పెరిగే అవకాశం ఉంది. ఒకేరోజు వస్తే మీరు ఏ సినిమాకు వెళ్తారు?
News March 18, 2025
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. 325 పాయింట్లు లాభ పడిన నిఫ్టీ 22,824 వద్ద ట్రేడ్‌ను ముగించింది. మరోవైపు, 1131 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 75,301 వద్ద ముగిసింది. అశోక్ లేల్యాండ్, వేదాంత, డీఎల్ఎఫ్, జిందాల్ స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, తదితర కంపెనీల షేర్లు లాభాలు గడించాయి.