News March 18, 2025

NZB: స్నేహితుడి ఇంట్లో దావత్.. గొడ్డలితో ATTACK

image

తాగిన మైకంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన వాగ్వాదం గొడ్డలితో వేటు వరకు దారితీసింది. ఈ ఘటన మాక్లూర్ పోలీస్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కల్లెడ గ్రామానికి చెందిన దేవతి పోశెట్టి అనే వ్యక్తి సోమవారం దుబాయ్ వెళ్లాల్సి ఉండగా, తన స్నేహితుడైన తెడ్డు లింగం ఇంట్లో దావత్ ఇచ్చాడు. దేవతి పోశెట్టి, తెడ్డు లింగం ఇద్దరికి మద్యం మత్తులో గొడవ జరిగింది. దీంతో లింగం, పోశెట్టిపై గొడ్డలితో దాడిచేశాడు

Similar News

News February 25, 2026

పోలవరంలో పెద్దపులి సమాచారం..అధికారుల తీరుపై అసహనం

image

పోలవరం జిల్లాలో పెద్దపులి సంచరించడం తెలిసిందే. అయితే అటవీశాఖ అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. పులిని దట్టమైన అటవిలో వదిలి ఉండాల్సిందని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అయితే అటవీశాఖ అధికారులు మాత్రం నల్లమల అటవీ ప్రాంతంలో ఇప్పటికే చాలా పులులు ఉండడం వల్ల ఇక్కడ వదలాల్సి వచ్చిందని, గతంలో పులి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తిరిగినా ఎవరికి హాని చేయలేదని గుర్తు చేస్తున్నారు.

News February 25, 2026

BREAKING: పాలమూరు: ఇంటర్ స్టూడెంట్ సూసైడ్

image

ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఎస్ఐ విక్రమ్ తెలిపిన వివరాలు.. MBNR జిల్లా నవాబ్‌పేట్(M) చాకలిపల్లికి చెందిన పురుషోత్తం(19) యన్మంగండ్లలోని కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఇంటర్ పరీక్షల నేపథ్యంలో చదువుపై శ్రద్ధ వహించడం లేదని కుటుంబీకులు ఇటీవల అతడిని మందలించారు. దీంతోపాటు ఇటీవల అతడి లవ్ కూడా ఫెయిలైందని మనస్తాపంతో ఉన్నాడు. ఈ క్రమంలో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు.

News February 25, 2026

HPV వ్యాక్సిన్ గురించి తెలుసా?

image

హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్‌ను అమ్మాయిలు తమ తొమ్మిదేళ్ల వయసు నాటి నుంచి 45 ఏళ్ల వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే దీన్ని గర్భంతో ఉన్నప్పుడు తీసుకోకూడదు. ఈ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్‌ రాకుండా చేస్తుంది. 9 నుంచి 15 సంవత్సరాల లోపు అమ్మాయిలు రెండు డోసులు, 15 సంవత్సరాలు దాటిన వారు మాత్రం మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక డోసు తీసుకున్న తర్వాత రెండో డోసును రెండు నెలల తర్వాత తీసుకోవాలి.