News March 18, 2025

రాబిన్ హుడ్ డైరెక్టర్‌ది భద్రాద్రి జిల్లానే…

image

నితిన్ హీరోగా నటించిన మూవీ రాబిన్ హుడ్ ఈ నెల 28న విడుదలవుతోంది. కాగా ఆ మూవీని డైరెక్ట్ చేసిన వెంకీ కుడుములది కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట. కాగా ఆయన HYDలో ఉంటుండగా, పేరెంట్స్ అశ్వారావుపేటలో ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు. ఆయన డైరెక్ట్ చేసిన భీష్మ, ఛలో సినిమాలు విజయం సాధించగా.. ఛలో మూవీకి ఉత్తమ తొలి దర్శకుడిగా సైమా అవార్డు అందుకున్నారు. కాగా ఆయన 2018లో ఛలో సినిమాతోనే సినీరంగ ప్రవేశం చేయడం గమనార్హం.

Similar News

News November 15, 2025

ADB: 25వ ఏటే అమరుడయ్యాడు!

image

ఆదివాసీ సమరయోధుడిగా చరిత్రకెక్కెని గొప్ప వీరుడు బిర్సా ముండా. ఆయన 1876నవంబర్ 15న ఝార్ఖండ్ ఉళిహటులో జన్మించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించారు. బిర్సా 1899 డిసెంబర్లో ఉల్గులన్ (విప్లవం) ప్రారంభించారు. ఎన్నో పోరాటాల అనంతరం తొలిసారి 1898లో బ్రిటిషర్లను ఓడించారు. 1900 ఫిబ్రవరి 3న ఆయన్ను అరెస్ట్ చేసి రాంచీ జైల్లో పెట్టారు. 1900జూన్ 9న తన 25వ ఏట జైల్లోనే అమరుడయ్యారు.

News November 15, 2025

సిరిసిల్ల: దుకాణాల సర్దుబాటు కోసం డీల్.. గుడ్ విల్..!

image

జిల్లాలో మద్యం దుకాణాలు పొందిన వ్యాపారులు తమకు అనుకూలమైన ప్రదేశాలలో వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 48 దుకాణాల కోసం 1,381 దరఖాస్తులు రాగా డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఇప్పటికే ఈ వ్యాపారంలో ఉన్నవారికి మరో చోట షాపు రావడంతో అక్కడ షాపు లభించిన వారితో చర్చలు జరిపి సర్దుబాటు చేసుకుంటున్నారు. కొత్తగా లైసెన్స్ దక్కిన వ్యక్తికి కోటి రూపాయల గుడ్ విల్ ఇచ్చి దుకాణం తీసుకున్నట్లు టాక్.

News November 15, 2025

కృష్ణా: కలెక్టరేట్‌లో చెత్తాచెదారం తొలగించిన కలెక్టర్

image

స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టరేట్ ఉద్యోగులు శ్రమదానం చేశారు. కలెక్టర్ డీకే బాలాజీతోపాటు వివిధ శాఖ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది శ్రమదానంలో పాల్గొన్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించారు. కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖరరావు, తదితరులు పాల్గొన్నారు.