News March 18, 2025

చిత్తూరు: పాఠశాల పని వేళల్లో మార్పు

image

పదవ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో పని వేళలను మార్పు చేస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యాహ్నం 1 నుంచి 5 వరకు పాఠశాలలు నడపాలని గతంలో ఇచ్చిన ఉత్తర్లను మార్పు చేశారు. మధ్యాహ్నం 1.30 నుంచి 5 వరకు పని వేళలను మార్పు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈ పని వేళల్లో పాఠశాలలు నిర్వహించాలని సూచించారు.

Similar News

News November 11, 2025

చిత్తూరు: విస్తృతంగా పోలీసుల తనిఖీ

image

ఢిల్లీలో జరిగిన దాడుల నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు జిల్లా అంతటా అన్ని ముఖ్యమైన రహదారులు, చెక్‌పోస్టులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు పట్టణ ప్రవేశ ద్వారాల వద్ద విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు చేపట్టారు. లాడ్జిలు, హోటళ్లలో సైతం తనిఖీలు చేశారు. అనుమానితులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

News November 10, 2025

రేపు జిల్లాలో నాలుగు పరిశ్రమల స్థాపనకు CM ప్రారంభోత్సవం

image

జిల్లాలో నాలుగు నూతన పరిశ్రమల స్థాపనకు సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో మంగళవారం ప్రారంభోత్సవం చేస్తారని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు, కుప్పం, పుంగనూరు, నగరి మండలాల పరిధిలో 116 ఎకరాలలో రూ.56.76 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమాలలో సంబంధిత ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు.

News November 10, 2025

చిత్తూరు: సమస్యల పరిష్కారానికి వినతులు

image

పీజీఆర్ఎస్‌లో వచ్చే ఫిర్యాదుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి అధికారులు పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. పెద్దపంజాణి మండలానికి చెందిన లక్ష్మీదేవి వన్ బీ కోసం, బొమ్మసముద్రం చెందిన భువనేశ్వరి వితంతు పింఛన్ కోసం, పీసీ గుంటకు చెందిన గుర్రప్ప పట్టాదారు పాసు పుస్తకం కోసం వినతి పత్రాలు ఇచ్చారు. మొత్తం 301 ఫిర్యాదులు వచ్చాయి.