News March 24, 2024
FLASH: HYD: డీజీల్ తరలిస్తున్న ముఠా గుట్టురట్టు

కోకాపేటలో కర్ణాటక నుంచి HYDకు డీజిల్‌ను తరలిస్తున్న ముఠాను శంషాబాద్ SOT పోలీసులు గుట్టురట్టు చేశారు. ట్యాంకర్లలో డీజీల్‌ను తెచ్చి HYD శివారు ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు గుర్తించారు. రూ.15 లక్షల విలువ చేసే 15 వేల లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేయగా.. నలుగురు పరారీలో ఉన్నారు. 4 డీజిల్ ట్యాంకర్లు సీజ్ చేసి సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు కేసు నమోదు చేశారు.
Similar News
News October 24, 2025
ఓయూ: MA ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షా తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని MA ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 6వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూడొచ్చని సూచించారు.
News October 24, 2025
ఓయూలో వాయిదా పడిన కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

ఓయూ పరిధిలో ఈ నెల 18న బీసీ బంద్ నేపథ్యంలో వాయిదా పడిన వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎమ్మెస్సీ అప్లైడ్ న్యూట్రిషన్, ఎమ్మెస్సీ స్పోర్ట్స్ న్యూట్రిషన్ నాలుగో సెమిస్టర్ పరీక్షలను తిరిగి ఈ నెల 29వ తేదీన నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రం, సమయంలలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.
News October 24, 2025
HYD: సాహితీ ఇన్ఫ్రా ఆస్తులను జప్తు చేసిన ఈడీ

సాహితీ ఇన్ఫ్రా ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మొత్తం ₹12.65 కోట్ల ఆస్తులను అటాచ్ చేసుకుంది. హైదరాబాద్‌లో ‘ఫ్రీ లాంచ్ ఆఫర్’ పేరిట వందల మందిని సాహితీ ఇన్ఫ్రా సంస్థ మోసం చేసినట్లు అధికారులు వెల్లడించారు. డైరెక్టర్ పూర్ణచందరరావు, కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. మొత్తం ₹126 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు ఈడీ విచారణలో తేలింది.


