News March 18, 2025
WGL: రైతులకు గుడ్ న్యూస్.. పెరిగిన పత్తి ధర..

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర భారీగా పెరిగింది. సోమవారం పత్తి ధర క్వింటాకి రూ.6,825 ధర పలకగా.. మంగళవారం రూ.6,975కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. ధర పెరగడం పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధరలు మరింత పెరగాలని ఆకాంక్షిస్తున్నారు.
Similar News
News July 5, 2025
విజయనగరం జిల్లాలో నేడు జాతీయ లోక్ అదాలత్

విజయనగరం జిల్లా కోర్టులో శనివారం జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు, ప్రజలు సద్వినియోగపరచుకోవాలని జిల్లా జడ్జ్ బబిత సూచించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్, చెక్కు బౌన్స్ కేసులు ఇరు వర్గాల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వత పరిష్కారం చేసుకోవచ్చన్నారు.
News July 5, 2025
భద్రాద్రి: జులైలో అధిక వర్షాపాతం నమోదయ్యే ఛాన్స్.!

రానున్న ఐదు రోజులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. జిల్లాలో అక్కడక్కడా ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. జులై నెలలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు గమనించాలని సూచించారు.
News July 5, 2025
KMM: బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలు

ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు, రూ.50 వేల జరిమానా విధిస్తూ ఖమ్మం జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి శుక్రవారం తీర్పునిచ్చారు. సత్తుపల్లి మండలానికి చెందిన ఓ బాలికపై మామిడి పాపారావు(30) అనే వ్యక్తి 2023లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోక్సో కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం సాక్ష్యాధారాలు పరిశీలించి జడ్జి పైవిధంగా తీర్పు చెప్పారు.