News March 18, 2025

ఎన్టీఆర్: భూ కేటాయింపులపై క్యాబినెట్ భేటీలో ఆమోదం

image

అమరావతిలో భూకేటాయింపులపై మంత్రి వర్గ ఉపసంఘం ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు సోమవారం క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. గతంలో జరిగిన 31 కేటాయింపులకు ఆమోదం తెలుపుతూ మరో 38 కేటాయింపులకు సవరణలు చేస్తూ ఉపసంఘం సూచనలు చేసింది. 14 కేటాయింపుల రద్దు, 6 కొత్త సంస్థలకు భూకేటాయింపులు చేస్తూ సిఫార్సులు చేయగా..వాటన్నింటిని క్యాబినెట్ ఆమోదించింది.

Similar News

News November 8, 2025

GNT: పేదవారికి ఉచితం.. రోగ నిర్ధారణలో కీలకం

image

ప్రతి సంవత్సరం నవంబరు 8న అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఎక్స్-రేను కనుగొన్న రోజును పురస్కరించుకొని ఈ దినోత్సవం జరుపుకుంటారు. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలోని రేడియాలజీ విభాగ సేవలు మరువలేనివి. అంతో ఖర్చుతో కూడిన MRI,CT, ఆల్ట్రాసౌండ్,Xray వంటి సేవలను ఉచితంగా ప్రజలకి అందించడంతో సామాన్యుల రోగ నిర్ధారణ సులభమైంది.

News November 8, 2025

HYD: ఓయూ UGC వ్యవహారాల డీన్‌గా బి.లావణ్య

image

ఉస్మానియా విశ్వవిద్యాలయం అభివృద్ధి &UGC వ్యవహారాల డీన్‌గా ప్రొఫెసర్ బి.లావణ్య పదవీకాలాన్ని పొడిగించారు. ప్రస్తుతం డీన్, అభివృద్ధి & UGC వ్యవహారాలుగా పనిచేస్తున్న చరిత్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ బి.లావణ్య పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈరోజు ప్రకటించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఎం.మోలుగారం ప్రొఫెసర్ లావణ్యకు అధికారిక ఉత్తర్వులు అందజేశారు.

News November 8, 2025

VKB: రైతులు దళారుల బారిన పడొద్దు: అదనపు కలెక్టర్

image

రైతులు పండించిన పంటలను దళారులకు అమ్మి మోసపోవద్దని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. తాండూర్‌లో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడుతూ.. వరి ధాన్యానికి ఏ గ్రేడ్‌కు రూ.2389, సన్న రకాలకు రూ.2369తో పాటు బోనస్‌గా రూ.500 చెల్లిస్తామని, సాధారణ రకాలకు రూ.2369 మద్దతు ధర ఇవ్వనున్నట్లు తెలిపారు. మొక్కజొన్నకు కూడా రూ.2400 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.