News March 18, 2025
VKB: రంజాన్ షాపింగ్‌కి వెళ్లొచ్చేసరికి చోరీ

షాపింగ్‌కు వెళ్లొచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగిన ఘటన వికారాబాద్ జిల్లా చెన్గోముల్‌లో జరిగింది. పోలీసుల వివరాలిలా.. పర్వీన్ బేగం, ఆమె భర్త మోరుఫ్ అలీ రంజాన్ పండుగ షాపింగ్ కు వికారాబాద్ వెళ్లారు. షాపింగ్ చేసుకొని తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి తాళాలు పగలకొట్టి దొంగతనం చేశారు. అరతులం గొలుసు, 20 తులాల వెండి, నగదు చోరీ చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News January 12, 2026
అక్షర యోధుడు అలిశెట్టి

కవిత్వంతో ప్రజల్లో ఆలోచనాదృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన అతికొద్ది మంది కవుల్లో అలిశెట్టి ప్రభాకర్ ఒకరు. చిత్రకారుడిగా, ఫొటో గ్రాఫర్‌గా పని చేస్తూనే కవిగా ఎదిగారు. సామాజిక చైతన్యమే ధ్యేయంగా కవిత్వాలు రాశారు. ‘ఎర్ర పావురాలు’, ‘మరణం నా చివరి చరణం కాదు’, ‘సిటీలైఫ్’ వంటి కవితా సంకలనాలు రచించారు. తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక పేజీ సృష్టించుకున్నారు. నేడు ఆయన జయంతి, వర్ధంతి(1956-1993).
News January 12, 2026
ICMR-NIIRNCDలో 45 పోస్టులకు నోటిఫికేషన్

<
News January 12, 2026
లోకేశ్ బందరు పోర్టు ట్వీట్.. తెలుగు తమ్ముళ్ల జోష్!

బందరు పోర్టుపై మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. పురాతన బందరు పోర్టు పునర్జీవం పోసుకుంటుందని ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని జోడించి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను టీడీపీ నేతలు తమ తమ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దేశంలో తొలి బ్రిటీష్ వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందిన ఈ పోర్టు 4 వేల కోట్లతో డీప్ సీ పోర్టుగా ప్రపంచ వాణిజ్యంలోకి అడుగు పెట్టబోతుందని ఆ ట్వీట్‌లో లోకేశ్ పేర్కొన్నారు.


