News March 18, 2025

భారత్ టెస్టుల్లో పేలవం.. రోహిత్‌దే బాధ్యత: గంగూలీ

image

టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో బాగా ఆడుతున్నా టెస్టుల్లో పేలవమేనని మాజీ క్రికెటర్ గంగూలీ అన్నారు. ‘కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రోహిత్ బాధ్యత తీసుకోవాలి. టెస్టుల్లో రోహిత్ బ్యాటింగ్ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతడి సామర్థ్యానికి మరింత మెరుగ్గా ఆడి ఉండాల్సింది. ఇంగ్లండ్‌తో ఆడనున్న టెస్టుల్లో గెలుపులపై రోహిత్ ముందుగానే ప్లాన్ వేయాలి. తెల్లబంతి ఫార్మాట్లలో మాత్రం అతడికి తిరుగులేదు’ అని కొనియాడారు.

Similar News

News July 4, 2025

అనిరుధ్ రెడ్డిపై టీపీసీసీ సీరియస్.. నోటీసులు ఇచ్చే అవకాశం?

image

TG: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై టీపీసీసీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని, ఇరిగేషన్&రోడ్డు కాంట్రాక్టులు చూసేది వారేనని ఇటీవల అనిరుధ్ <<16911067>>వ్యాఖ్యానించిన<<>> సంగతి తెలిసిందే. దీనిపై వివరణ కోరి నివేదిక ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణ కమిటీని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఆదేశించినట్లు సమాచారం.

News July 4, 2025

దేశ వ్యతిరేక పోస్టులపై కఠిన చర్యలు?

image

దేశానికి వ్యతిరేకంగా కంటెంట్ క్రియేట్ చేసే వారికి చుక్కలు చూపించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం కేంద్ర హోంశాఖ కొత్త పాలసీని రూపొందిస్తున్నట్లు సమాచారం. వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో పెట్టే కంటెంట్‌ను పరిశీలించి, దేశ వ్యతిరేక పోస్టులను గుర్తించేందుకు ఓ టీమ్‌ను ఏర్పాటు చేయనుంది. ఆయా అకౌంట్లను బ్లాక్ చేయడంతో పాటు పోస్ట్ చేసిన వారిపైనా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి.

News July 4, 2025

AI ద్వారా భూ సమస్యల పరిష్కారం: మంత్రి అనగాని

image

AP: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూములను ఆధార్, సర్వే నంబర్లతో లింక్ చేస్తామని చెప్పారు. ‘రైతులకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సలహాలు ఇస్తున్నాం. గ్రీవెన్స్ ద్వారా ఇప్పటివరకు 4.63 లక్షల ఫిర్యాదులు రాగా 3.99 లక్షల ఫిర్యాదులు పరిష్కరించాం. త్వరలోనే మిగతా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.