News March 18, 2025

MBNR: కట్నం వేధింపులతో ఆత్మహత్య.. తల్లి ఫిర్యాదు

image

జడ్చర్ల మండలంలో నవవధువు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాకి చెందిన చర్చిత(23)కు రాళ్లగడ్డతండాకు చెందిన పవన్‌తో జనవరి31న పెళ్లి జరిగింది. వధువు తల్లిదండ్రులు పెళ్లికి రావాలంటే రూ.10లక్షలు వరకట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేయటంతో వారు పెళ్లికి రాలేదు. పెళ్లి తర్వాత అత్త, మామలు వేధింపులకు గురిచేయటంతో చర్చిత ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి రాధిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.

Similar News

News March 18, 2025

జడ్చర్ల బస్టాండ్‌లో దొంగలు.. జర జాగ్రత్త..!

image

సెల్‌ఫోన్ల చోరీకి పాల్పడుతున్న దొంగలను మంగళవారం జడ్చర్ల ఆర్టీసీ బస్టాండ్‌లో సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. విజిలెన్స్ సెక్యూరిటీ లింగంపేట శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. బస్టాండ్‌లో ప్రయాణికుల నుంచి సెల్‌ఫోన్ల చోరీకి పాల్పడుతున్న వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా పట్టుబడ్డ నిందితులు నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వారి నుంచి 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

News March 18, 2025

మహబూబ్‌నగర్: దివ్యాంగ విద్యార్థులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ

image

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం భవిత సెంటర్లలో ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నట్లు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని సమగ్ర శిక్ష సమావేశ మందిరంలో నిర్వహించిన దివ్యాంగ విద్యార్థులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. భవిత సెంటర్లలో ఇస్తున్న ప్రత్యేక శిక్షణను దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలన్నారు.

News March 18, 2025

PU: విద్యార్థులకు ప్రైజ్ మనీ, సర్టిఫికెట్ల ప్రదానం 

image

మహబూబ్‌నగర్ పట్టణ పరిధిలోని పాలమూరు యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి యువ ఉత్సవ్-25 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రైజ్ మనీతోపాటు సర్టిఫికెట్స్, మెమొంటోస్‌లను పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జీఎన్ శ్రీనివాస్,రిజిస్ట్రార్ ఆచార్య చెన్నప్ప ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా కళాశాలల అధ్యాపకులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!