News March 18, 2025
ఇటలీలో సిరిసిల్ల జిల్లా వ్యక్తి మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వ్యక్తి ఇటలీలో రోడ్డు ప్రమాదంలో 15 రోజుల క్రితం మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎల్లారెడ్డిపేటకు చెందిన మహమ్మద్ రషీద్ (47) ఇటలీలో లారీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రోడ్డు దాటుతున్న క్రమంలో వేరే వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహం రెండు రోజుల్లో స్వగ్రామం రానుంది.
Similar News
News March 19, 2025
దిల్‌సుఖ్‌నగర్‌లో వ్యభిచారం.. నాగమణి దొరికిందిలా! (UPDATE)

దిల్‌సుఖ్‌నగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న నాగమణిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. డెకాయ్ ఆపరేషన్ చేసి నిందితురాలిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ‘హలో నాగమణి’ అంటూ వాట్సాప్‌లో విటుల వలే మెసేజ్ చేయడంతో ఆమె దిల్‌సుఖ్‌నగర్‌కు అమ్మాయిని తీసుకొచ్చింది. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమీర్‌పేట వాసి నాగమణి సినిమా అవకాశం అంటూ యువతులను వ్యభిచారంలోకి దింపుతున్నట్లు తేల్చారు.
News March 19, 2025
‘భర్త అనుమానించడం వలనే హత్య చేశా’

విశాఖలో ఓ తల్లి కన్న కూతురినే హతమార్చింది. పెద్దగదిలిలో జరిగిన ఈ హత్య కేసులో నిజానిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పాప పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కారణంగా తెలుస్తోంది. భర్త అనుమానంతో బెడ్ రూమ్‌లో కూడా CC కెమెరా పెట్టాడని దీంతో మనస్తాపం చెంది కూతురిని తల దిండు అదిమి ఊపిరాడకుండా చేసి చంపినట్లు నిందితురాలు శిరీష పోలీసుల దర్యాప్తులో వెల్లడించినట్లు ఆరిలోవ CI మల్లేశ్వరరావు తెలిపారు.
News March 19, 2025
మంచిర్యాల: తల్లిదండ్రులు మందలించారని సూసైడ్

తల్లిదండ్రులు మందలించడంతో యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. SI వివరాలు.. MNCL జిల్లా శివ్వారంకి చెందిన రాకేశ్(26) ప్రైవేట్ కంపెనీలో పని చేసి మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు. తల్లిదండ్రులు పని చేసుకోవాలని, పొలం పనులైనా చేయమని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన రాకేశ్ పొలం వద్ద ఉరేసుకున్నాడు. మంగళవారం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.