News March 18, 2025
అత్యాచారం కేసులో పేరుసోమల వ్యక్తికి జీవిత ఖైదు

అత్యాచారం కేసులో నంద్యాల జిల్లా వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష పడింది. సంజామల మండలం పేరుసోమలకు చెందిన ఉప్పు నాగహరికృష్ణ 2020లో తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాకు చెందిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదైంది. విచారణలో నేరం రుజువు కావడంతో హరికృష్ణకు జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా విధిస్తూ కర్నూలు జిల్లా మహిళా కోర్టు జడ్జి వి.లక్ష్మీరాజ్యం తీర్పు చెప్పారు.
Similar News
News March 19, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు.

కామారెడ్డి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం గాంధారిలోని సర్వపూర్ 40.7°Cఉష్ణోగ్రత నమోదైంది. అలాగే పాల్వంచలోని ఎల్పుగొండ, బిచ్కుంద, రామారెడ్డి 40.5, మద్నూర్‌లోని సోమోర్, బాన్సువాడలోని కొల్లూరు 40.4,జుక్కల్ 40.2,నసురుల్లాబాద్, నాగిరెడ్డి పేట్ 40.1, పిట్లo, పాల్వంచలోని ఇసాయిపేట్, సదాశివనగర్, దోమకొండ 40.0, భిక్నూరు, కామారెడ్డి 39.7°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
News March 19, 2025
నర్వ: ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

నర్వ మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ల్యాబ్, ప్రసూతి గది, ఇన్ పేషంట్ వార్డులను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి గదిలో బేబి వార్మ్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో పెట్టాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు.
News March 19, 2025
NRPT: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి..

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకట్రామిరెడ్డి, బలరాం అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కలెక్టరేట్ వద్ద రేపు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు విడుదల చేయాలని అన్నారు. కార్మికులకు ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని కోరారు.