News March 18, 2025
భారీ లాభాల్లో మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 736 పాయింట్ల లాభంతో 75,047 వద్ద ట్రేడ్ అవుతుంటే, నిఫ్టీ 255 పాయింట్ల లాభంతో 22,764 వద్ద కదలాడుతోంది. జొమాటో, ఐసీఐసీఐ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, HUL, L&T షేర్లు లాభాల్లో ఉన్నాయి.
Similar News
News March 18, 2025
రేపు, ఎల్లుండి జాగ్రత్త

AP: మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. రేపు 58 మండలాల్లో, ఎల్లుండి 37 మండలాల్లో వడగాలులు వీస్తాయని <
News March 18, 2025
కావలి గ్రీష్మ రాజీనామాకు ఆమోదం

AP: ఏపీ మహిళా కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ పదవికి కావలి గ్రీష్మ ఈ నెల 9న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించగానే ఆమె రాజీనామా చేశారు. ఇటీవల ఆమె ఆ కోటాలో MLCగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం గ్రీష్మ రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
News March 18, 2025
విశాఖ మేయర్ పీఠాన్ని కాపాడుకుంటాం: కన్నబాబు

AP: విశాఖ మేయర్ పీఠంపై <<15799147>>కూటమి కన్నేయడంతో<<>> వైసీపీ అప్రమత్తమైంది. ఇవాళ కార్పొరేటర్లతో ఉత్తరాంధ్ర సమన్వయకర్త కన్నబాబు సమావేశయ్యారు. ఈ భేటీకి 34 మంది హాజరుకాగా, ముగ్గురు రాలేదు. తమ కార్పొరేటర్లను ప్రలోభపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. మేయర్ స్థానాన్ని కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. చీప్ పాలిటిక్స్ మానుకోవాలని CBNకు మాజీ మంత్రి అమర్నాథ్ హితవు పలికారు.