News March 18, 2025
కాకినాడ: పరువుగా బతికి.. అప్పులపాలై ఆత్మహత్య

కాకినాడ రూరల్ పండూరుకు చెందిన బావిశెట్టి వెంకటేశ్వరరావు (48) ట్యాంకర్స్ నడుపుతూ జీవనం సాగించేవాడు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ట్యాంకర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పులపాలై స్వగ్రామంలో ఉండలేక హైదరాబాద్ వెళ్లిపోయారు. 2నెలల్లో వస్తానని చెప్పి వెళ్లిన ఆయన నెల గడవకముందే నిన్న ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. నేడు మృతదేహం స్వగ్రామానికి రానుంది.
Similar News
News November 14, 2025
‘జూబ్లీ’ రిజల్ట్స్: ఉదయం 8 గంటలకు కౌంటింగ్..

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. ఉ.8గంటలకు పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రారంభం కానుంది. 58 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో లెక్కింపునకు 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని, ఎప్పటికప్పుడు ఫలితాలను EC వైబ్‌సెట్‌లో అప్డేట్ చేస్తామని అధికారులు తెలిపారు. ఒక్కో రౌండ్‌కు 45 నిమిషాలు పట్టనుంది.
News November 14, 2025
మెదక్ జిల్లాలో కవిత పర్యటన

కవిత జాగృతి జనంబాట నేటి నుంచి మెదక్ జిల్లాలో ప్రారంభం కానుంది. నర్సాపూర్ నలంద స్కూల్లో చిల్డ్రన్స్ డే వేడుకల్లో పాల్గొంటారు. రెడ్డిపల్లిలో రీజనల్ రింగ్ రోడ్డు, కాల్వలు, హై టెన్షన్ లైన్ కోసం భూములు కోల్పోయిన బాధితులతో సమావేశం. పోతన్ శెట్టిపల్లిలో వివిధ పార్టీల నుంచి జాగృతి చేరికలు, ఘణపూర్ ఆనకట్ట సందర్శన, ఏడుపాయల వన దుర్గా అమ్మవారి దర్శనం, మెదక్ చర్చ్, పల్లికొట్టాల డబుల్ బెడ్ రూం సందర్శిస్తారు.
News November 14, 2025
వరంగల్: రైతులకు కొరకరాని కొయ్యగా మారిన కొత్త నిబంధనలు!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పత్తి కొనుగోలు నిబంధనలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సీసీఐ అధికారులు ఒక్కో రైతు ఒక ఎకరానికి కేవలం 7 క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేయాలని మార్గదర్శకాలు జారీ చేయడంతో ఎక్కువ దిగుబడి సాధించిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, కపాస్ యాప్ ద్వారా మాత్రమే స్పాట్ బుకింగ్ చేయాలనే నియమం రైతుల ముందున్న మరో అడ్డంకిగా మారింది.


