News March 18, 2025

ఎన్టీఆర్: ఆటల పోటీల్లో పాల్గొనే MLAలు వీరే

image

మంగళవారం సాయంత్రం విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరగనున్న MLA, MLCల ఆటల పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా నుంచి పలువురు పేర్లు నమోదు చేసుకున్నారు. పురుషుల 100 మీ. పరుగుపందెం పోటీలకు మైలవరం ఎమ్మెల్యే వసంత తన పేరు నమోదు చేసుకోగా, క్రికెట్ మ్యాచ్‌కు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పేర్లు నమోదు చేసుకున్నట్లు సమాచారం వెలువడింది.

Similar News

News March 19, 2025

కామారెడ్డి జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు.

image

కామారెడ్డి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం గాంధారిలోని సర్వపూర్ 40.7°Cఉష్ణోగ్రత నమోదైంది. అలాగే పాల్వంచలోని ఎల్పుగొండ, బిచ్కుంద, రామారెడ్డి 40.5, మద్నూర్‌లోని సోమోర్,  బాన్సువాడలోని కొల్లూరు 40.4,జుక్కల్ 40.2,నసురుల్లాబాద్, నాగిరెడ్డి పేట్ 40.1, పిట్లo, పాల్వంచలోని ఇసాయిపేట్, సదాశివనగర్, దోమకొండ 40.0, భిక్నూరు, కామారెడ్డి 39.7°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

News March 19, 2025

నర్వ: ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

నర్వ మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ల్యాబ్, ప్రసూతి గది, ఇన్ పేషంట్ వార్డులను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి గదిలో బేబి వార్మ్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో పెట్టాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు.

News March 19, 2025

NRPT: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి..

image

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకట్రామిరెడ్డి, బలరాం అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కలెక్టరేట్ వద్ద రేపు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు విడుదల చేయాలని అన్నారు. కార్మికులకు ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని కోరారు.

error: Content is protected !!