News March 18, 2025

ధోనీ ఫిట్‌నెస్ చూసి షాకయ్యాను: హర్భజన్

image

43 ఏళ్ల వయసులోనూ ధోనీ ఫిట్‌నెస్ చూసి షాకైనట్లు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపారు. ‘ఓ పెళ్లికి హాజరైన సందర్భంగా ఇద్దరం కలిశాం. చాలా ఫిట్‌గా, సాలిడ్‌గా కనిపించారు. ఈ వయసులో ఇలా ఉండటానికి ఏం చేస్తున్నావని అడిగా. ఆటలో సంతోషం పొందుతున్నానని, ఆడాలని ఉంది కాబట్టే ఆడుతున్నానని అన్నారు. రోజూ 3 గంటలపాటు కఠోరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్‌నుంచి అందరికంటే చివరగా బయటికొచ్చేది ఆయనే’ అని తెలిపారు.

Similar News

News March 19, 2025

నెల రోజులపాటు గ్రామ గ్రామాన సంబరాలు: టీపీసీసీ చీఫ్

image

TG: BC కులగణన, SC వర్గీకరణపై రాష్ట్రమంతటా పెద్దఎత్తున ప్రచారం చేయాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. ‘అసెంబ్లీలో BC కులగణన, SC వర్గీకరణ బిల్లులను ఆమోదించుకున్నాం. ఇవి చరిత్రలోనే నిలిచిపోయే ఘట్టాలు. వీటి ప్రాముఖ్యత ప్రజలకు తెలిసేలా గ్రామాల్లో నెల రోజులపాటు సంబరాలు నిర్వహించాలి. జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాలను కూడా నిర్వహించాలి’ అని తెలిపారు.

News March 19, 2025

నిద్రపోయే ముందు నీరు తాగుతున్నారా?

image

రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని నీరు తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆహారం బాగా జీర్ణం అవడంతో పాటు కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తదితర సమస్యలు తొలగిపోతాయి. పొట్ట తేలికగా మారిన భావన కలుగుతుంది. వీటితో పాటు నాడీ వ్యవస్థ రిలాక్స్ అయి ఒత్తిడి తగ్గుతుంది. యాంగ్జైటీ వంటి సమస్యలు దూరమై హాయిగా నిద్ర పడుతుంది. నిద్రలేమితో బాధపడేవారికి గోరువెచ్చని నీరు చక్కటి పరిష్కారం.

News March 19, 2025

తూ.గో. జిల్లాలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ

image

AP: తూ.గో. జిల్లా దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటవీ, వన్యప్రాణి సంరక్షణపై అటవీ శాఖ ఉద్యోగులు లోతైన శిక్షణ పొందేందుకు అనువైన వాతావరణ అక్కడ ఉండాలని Dy.CM పవన్ అన్నారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీని ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయగా తాజాగా దివాన్ చెరువు ప్రాంతంలో ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.

error: Content is protected !!