News March 18, 2025
నేటి నుంచే అంగన్వాడీల్లో ఒంటి పూట: మంత్రి

AP: ఎండల తీవ్రత నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో నేటి నుంచే ఒంటి పూట అమల్లోకి తీసుకొచ్చారు. ఉదయం 8 నుంచి 12 వరకు పిల్లలకు ప్రీ స్కూల్ నిర్వహించాలని మంత్రి సంధ్యారాణి ఆదేశించారు. పిల్లలకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 10, 2025
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? రైల్వే టికెట్ బుకింగ్స్ మొదలు!

వచ్చే సంక్రాంతికి (జనవరి 2026) ఊళ్లకు వెళ్లాలనుకునేవారికి అలర్ట్. భారతీయ రైల్వే టికెట్ బుకింగ్స్ 60 రోజుల ముందుగానే ప్రారంభమవుతాయి. ఇవాళ జనవరి 9వ తేదీవి, రేపు JAN 10, ఎల్లుండి JAN 11, గురువారం రోజున జనవరి 12వ తేదీకి సంబంధించిన టికెట్లు రిలీజ్ కానున్నాయి. సొంతూళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండి IRCTC అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా వెంటనే బుక్ చేసుకోవచ్చు. SHARE IT
News November 10, 2025
సేఫ్ పాస్‌వర్డ్ ఇలా సెట్ చేసుకోండి

సైబర్ నేరాలు, హ్యాకింగ్స్ విపరీతంగా పెరిగిపోతున్నందున <<18240768>>పాస్‌వర్డ్‌లపై<<>> ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచిస్తున్నారు టెక్ నిపుణులు. పాస్‌వర్డ్‌ను ఎలా సెట్ చేసుకుంటే సేఫ్ అనే విషయాలను చెబుతున్నారు. అప్పర్‌కేస్, లోయర్‌కేస్ లెటర్స్, నంబర్స్, సింబల్స్ కాంబోలో పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలని అంటున్నారు. ఫోన్ నంబర్లు, బర్త్‌డేలు, ఫ్యామిలీ మెంబర్ల పేర్లను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకోకూడదని హెచ్చరిస్తున్నారు.
News November 10, 2025
కర్బూజాలో బూజు తెగులును ఎలా నివారించాలి?

కర్బూజాలో బూజు తెగులు ఒక సాధారణ శిలీంధ్ర వ్యాధి. ఇది ఆకులు, కాండం, పండుపై తెల్లటి లేదా బూడిద రంగు బూజు మచ్చలను ఏర్పరుస్తుంది. ఈ బూజు తెగులు నివారణకు 200 లీటర్ల నీటిలో మెటలాక్సిల్ 8%+మాంకోజెబ్ 64% డబ్ల్యూ.పి. 72% 400 గ్రా. లేదా డైమెథోమార్ఫ్ 9%+మాంకోజెబ్ 60% డబ్ల్యూ.పి. 300 గ్రా.లలో ఏదైనా ఒకదానితో పాటు జిగురు పదార్థం 100ml లను కలిపి మొక్కలకు సరిపడా ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి.


