News March 18, 2025

నల్గొండ: సీతారాముల కళ్యాణ తలంబ్రాలు ఇంటికే: RM

image

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలను TGS RTC కార్గో ద్వారా రూ.151 చెల్లిస్తే భక్తుల ఇళ్ల వద్దకు చేరుస్తామని ఉమ్మడి నల్గొండ రీజినల్ మేనేజర్ కే. జాని రెడ్డి తెలిపారు. ప్రజలు తమ దగ్గరలో ఉన్న ఆర్టీసి లాజిస్టిక్స్‌లో రూ.151 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News January 22, 2026

యాసంగి సీజన్లో జోరుగా వరి నాట్లు

image

జిల్లాలో వరి నాట్లు జోరందుకున్నాయి. యాసంగి సీజన్లో ఇప్పటివరకు 4 లక్షల 24వేల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయినట్లు తెలుస్తుంది. మరో లక్ష ఎకరాలకు సరిపడా వరి నార్లు సిద్ధం చేసుకున్నారు. ఈ సీజన్లో మొత్తం 6,57,000 ఎకరాల్లో వరి తదితర పంటలు సాగుతున్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. ప్రస్తుతం యాసంగి సీజన్లో రైతులు కూలీల కొరతను అధిగమించేందుకు ఎక్కువగా వెదజల్లే పద్ధతిని పాటించారు.

News January 22, 2026

నల్గొండ జిల్లాలోనూ భూభారతి కుంభకోణం..!

image

నల్గొండ జిల్లాలోనూ భూభారతి కుంభకోణం వెలుగు చూసింది. జిల్లాలోని చిట్యాలలో ఆరు, గట్టుపల్ లో మూడు, నాంపల్లిలో ఒకటి, చండూరులో ఒకటి చొప్పున రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిగినట్లు నల్గొండ జిల్లా రెవెన్యూ అధికారులు గుర్తించారు. దాదాపు 11 రిజిస్ట్రేషన్లలో సుమారు నాలుగు లక్షల మేర కొల్లగొట్టినట్లు తెలుస్తుంది. వాటిపై నివేదికలను రూపొందించి సీసీఎల్ఏకు పంపించినట్లు సమాచారం.

News January 22, 2026

నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలపై వామపక్షాల గురి

image

నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల రణం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీల త్రిముఖ పోరులో కమ్యూనిస్టులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. కేవలం గెలుపు కోసమే కాకుండా, ఫలితాల తర్వాత ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. తమ మద్దతు లేకుండా మేయర్ పీఠం దక్కదని వామపక్షాలు ధీమాగా ఉన్నాయి. బలాబలాల లెక్కల్లో తమదే కీలక పాత్ర అని కమ్యూనిస్టు నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.