News March 18, 2025

జపాన్‌లో ‘దేవర’ స్పెషల్ షోకు అనూహ్య స్పందన

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా జపాన్ ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఈనెల 28న జపాన్‌లో ‘దేవర’ రిలీజ్ కానుండగా మేకర్స్ స్పెషల్ షోను ఏర్పాటు చేశారు. దీనికి భారీగా ప్రేక్షకులు తరలివచ్చారు. మూవీ అద్భుతంగా ఉందంటూ వారు SMలో పోస్టులు పెడుతున్నారు. కాగా, ప్రమోషన్ల కోసం ఎన్టీఆర్, మేకర్స్ ఈనెల 22న జపాన్‌కు వెళ్లనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి.

Similar News

News March 19, 2025

ఆ విద్యార్థులకు స్కాలర్‌షిప్ పెంపు

image

AP: తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర పశువైద్య యూనివర్సిటీ విద్యార్థులకు నెలవారీగా ఇచ్చే స్కాలర్‌షిప్‌ను ప్రభుత్వం పెంచింది. అండర్ గ్రాడ్యుయేట్స్‌కు రూ.7వేల నుంచి రూ.10,500కు, పీజీ విద్యార్థులకు రూ.9వేల నుంచి రూ.13,500కు, పీహెచ్‌డీ స్టూడెంట్లకు రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంచింది.

News March 19, 2025

10,000 మంది ఉద్యోగులకు అమెజాన్ లేఆఫ్స్

image

ప్రముఖ ఈకామర్స్ కంపెనీ అమెజాన్ 10,000మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది నవంబర్‌లోనే దాదాపు 18వేల మందికి లేఆఫ్స్ ఇచ్చిన అమెజాన్ ఇప్పుడు మరోసారి ఉద్యోగాలకు కోత విధించనుంది. దీనిని పలువురు టెక్ నిపుణులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. AI టెక్నాలజీ రావడంతో పలు ఐటీ సంస్థలు భారీ స్థాయిలో లేఆఫ్స్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.

News March 19, 2025

ఫోన్ ట్యాపింగ్.. వారిద్దరికీ రెడ్ కార్నర్ నోటీసులు

image

TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు, ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ కుమార్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినట్టు అధికారులు ప్రకటించారు. దీనిపై CBI నుంచి రాష్ట్ర సీఐడీకి సమాచారం వచ్చింది. వారిద్దరినీ వీలైనంత త్వరగా మన దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖలతో హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు.

error: Content is protected !!