News March 18, 2025
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో సత్తాచాటిన నర్మాల మహిళ

గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన పి.లావణ్య హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జోన్-3 ఉమెన్స్‌లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. లావణ్య ఎంఎస్సీ బీఈడీ పూర్తిచేసి కేజీబీవీలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తోంది. గ్రూప్4లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించింది. ఉద్యోగం చేస్తూనే హాస్టల్ వెల్ఫేర్ జాబ్‌కు ప్రిపేరై జాబ్ కొట్టింది.
Similar News
News November 6, 2025
మహిళల్లో అధిక మూత్ర విసర్జనకు కారణాలివే..

వయసు తక్కువగా ఉన్నా కూడా అతిగా మూత్రవిసర్జనకు వెళ్తుంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కారణమంటున్నారు నిపుణులు. పెల్విక్ నొప్పి, పీరియడ్స్‌లో బ్లీడింగ్ ఎక్కువగా అవడం, మెనోపాజ్ వల్ల ఇలా జరుగుతుందంటున్నారు. అలాగే మూత్రం ఆపుకోలేకపోవడానికి పునరుత్పత్తి, మూత్ర అవయవాల నిర్మాణం, కాన్పులు, నెలసరి నిలిచాక హార్మోన్ల మార్పుల వంటివి కారణం. దీన్ని నివారించడానికి కెగెల్ వ్యాయామాలు ఉపయోగపడతాయంటున్నారు.
News November 6, 2025
నేటి నుంచి యథావిధిగా పత్తి కొనుగోళ్లు: వరంగల్ కలెక్టర్

ఈ నెల 6 నుంచి పత్తి కొనుగోళ్లు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ సత్య శారద తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి, ఏపీసీ, కార్యదర్శి, సీఎండీ-సీసీఐతో పాటు జీఎంఎస్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డితో జరిగిన చర్చల ఫలితంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.జిల్లా వ్యాప్తంగా మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల వద్ద కొనుగోళ్లు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ వెల్లడించారు. దీంతో నేటి నుంచి చేపట్టాల్సిన సమ్మె వాయిదా పడింది.
News November 6, 2025
పొత్కపల్లి రైల్వే స్టేషన్‌కు ఘన చరిత్ర.. మరిస్తే ఎట్లా..?

నిజాం నవాబు ప్రభుత్వం నాటి నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న పొత్కపల్లి రైల్వే స్టేషన్ నుంచి గతంలో నాగ్‌పూర్‌కు మిరప ఎగుమతులు జరిగేవని, బొగ్గు ఇంజిన్లకు నీటి వసతి కలిగిన ముఖ్య కేంద్రంగా ఈ స్టేషన్ ఉండేదని గ్రామస్థులు తెలిపారు. 40 గ్రామాలకు అనుకూలంగా ఉన్న ఈ స్టేషన్‌ను నిర్వీర్యం చేయడం తగదని, అమృత్ భారత్ పథకంలో దీనిని చేర్చి అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు రైల్వే అధికారులను కోరుతున్నారు.


