News March 18, 2025

బాపట్ల: ‘ఎండల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి’ 

image

ప్రజలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తగిన జాగ్రత్తలను తీసుకోవాలని బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి విజయమ్మ తెలిపారు. మంగళవారం వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆమె వివరించారు. ప్రజలు బయటకు వెళ్లే సమయంలో గొడుగు వినియోగించాలన్నారు. మంచి నీరు, మజ్జిగను ఎక్కువగా తీసుకోవాలన్నారు.

Similar News

News October 28, 2025

NTR: బాలికపై దారుణం.. నలుగురు కలిసి.!

image

15 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన NTR జిల్లా చందర్లపాడు(M)లో జరిగింది. చిన్న పిల్లలతో ఆడుకుంటున్న బాలికకు నలుగురు వ్యక్తులు జామకాయల ఆశ చూపి ఓ ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో బాలిక బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జామకాయల్లో మత్తు మందు కలిపి అత్యాచారం చేసినట్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ ధర్మరాజు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు.

News October 28, 2025

నిత్యారాధన ఫలితాలు

image

శివ మహాపురాణం ప్రకారం.. నిత్యారాధన విశేష ఫలితాలనిస్తుంది. ఆదివారం సూర్యారాధన నేత్ర, శిరో, చర్మ రోగాలను పోగొడుతుంది. అన్నదానం చేయడం శుభకరం. సంపద కోసం సోమవారం లక్ష్మీదేవిని, రోగ నివారణకై మంగళవారం కాళిని, కుటుంబ క్షేమం కోసం బుధవారం విష్ణువును, ఆయువుకై గురువారం, భోగాలకై శుక్రవారం సకల దేవతలను, అపమృత్యువు నివారణకై శనివారం రుద్రాది దేవతలను పూజించాలి. ఈ నిత్యారాధనలు మనకు సకల శుభాలు కలిగిస్తాయి. <<-se>>#SIVOHAM<<>>

News October 28, 2025

భద్రాచలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సబ్ కలెక్టర్

image

‘మొంథా’ తుపాను హెచ్చరికల నేపథ్యంలో భద్రాచలం ఏజెన్సీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట సూచించారు. నేటి నుంచి 30 వరకు అనవసర ప్రయాణాలు మానుకోవాలన్నారు. ప్రజలు స్థానిక అధికారులకు సహకరించి, భద్రతా చర్యలు పాటించాలని కోరారు. తుపాను నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.