News March 18, 2025

బాక్సాఫీస్ సమరానికి సిద్ధమైన అన్నదమ్ములు?

image

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే, ఇదేరోజున మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘భైరవం’ కూడా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోందని సినీవర్గాలు తెలిపాయి. ఇప్పటికే పరస్పర ఘర్షణలతో అన్నదమ్ములు వార్తల్లో నిలుస్తుండగా ఒకేరోజు రిలీజైతే మంచు ఫ్యామిలీలో గొడవలు పెరిగే అవకాశం ఉంది. ఒకేరోజు వస్తే మీరు ఏ సినిమాకు వెళ్తారు?

Similar News

News March 19, 2025

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన జట్లు

image

*1681- ముంబై ఇండియన్స్
*1649- ఆర్సీబీ
*1513- పంజాబ్ కింగ్స్
*1508- చెన్నై సూపర్ కింగ్స్
*1492- కేకేఆర్
*1348- ఢిల్లీ క్యాపిటల్స్
*1235- రాజస్థాన్
*1038- సన్‌రైజర్స్ హైదరాబాద్ *400- డెక్కన్ ఛార్జర్స్
*332- లక్నో *270- గుజరాత్ టైటాన్స్

News March 19, 2025

ఆ విద్యార్థులకు స్కాలర్‌షిప్ పెంపు

image

AP: తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర పశువైద్య యూనివర్సిటీ విద్యార్థులకు నెలవారీగా ఇచ్చే స్కాలర్‌షిప్‌ను ప్రభుత్వం పెంచింది. అండర్ గ్రాడ్యుయేట్స్‌కు రూ.7వేల నుంచి రూ.10,500కు, పీజీ విద్యార్థులకు రూ.9వేల నుంచి రూ.13,500కు, పీహెచ్‌డీ స్టూడెంట్లకు రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంచింది.

News March 19, 2025

10,000 మంది ఉద్యోగులకు అమెజాన్ లేఆఫ్స్

image

ప్రముఖ ఈకామర్స్ కంపెనీ అమెజాన్ 10,000మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది నవంబర్‌లోనే దాదాపు 18వేల మందికి లేఆఫ్స్ ఇచ్చిన అమెజాన్ ఇప్పుడు మరోసారి ఉద్యోగాలకు కోత విధించనుంది. దీనిని పలువురు టెక్ నిపుణులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. AI టెక్నాలజీ రావడంతో పలు ఐటీ సంస్థలు భారీ స్థాయిలో లేఆఫ్స్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.

error: Content is protected !!