News March 18, 2025
సత్యసాయి: ఆధార్ నమోదులో ఎలాంటి తప్పులు దొర్లరాదు

ఆధార్ నమోదులో ఎలాంటి తప్పులు జరగకూడదని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయంలో ఆధార్ నమోదుపై జిల్లా కమిటీతో సమావేశం నిర్వహించారు. ఐదేళ్లలోపు పిల్లలకు వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్, జిఎస్‌డబ్ల్యూ, పోస్టల్ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆధార్ కేంద్రాలలో నమోదు చేయాలని సూచించారు.
Similar News
News January 12, 2026
ఏలూరు: ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 276 అర్జీలు

ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు ప్రజల నుంచి 276 అర్జీలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చక్కని వేదికలని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News January 12, 2026
పీజీఆర్ఎస్ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ కృతిక శుక్లా అర్జీలను స్వీకరించారు. ఇంటి గ్రామాల నుంచి వచ్చిన వారి వద్ద నుంచి 142 అర్జీలను స్వీకరించారు. వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అర్జీలను నాణ్యతతో, సకాలంలో పరిష్కరించాలని, పీజీఆర్ఎస్ గ్రీవెన్స్‌పై ఆడిట్ నిర్వహించి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News January 12, 2026
పాడేరు: నిరుద్యోగ గిరిజన యువతకు ఉచిత శిక్షణ

పాడేరు ఐటీడీఏ పరిధి 11మండలాలకు చెందిన నిరుద్యోగ గిరిజన యువత 45 రోజుల ఉచిత శిక్షణకు ధరఖాస్తు చేసుకోవాలని పీవో శ్రీపూజ సోమవారం తెలిపారు. సఖి డ్రైవర్‌గా పనిచేసేందుకు డ్రైవింగ్ శిక్షణ, పర్యాటక ప్రాంతాల్లో ఫొటోగ్రఫీ తీసేందుకు, మినీ హోటల్ నిర్వహణకు, హోంస్టేల నిర్వహణ కోసం ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన 18-35ఏళ్ల లోపు యువత ఈనెల 24లోగా ఐటీడీఏలో దరఖాస్తులు నేరుగా అందించాలన్నారు.


