News March 18, 2025

జొన్నగిరి ఎస్ఐ జయశేఖర్ బదిలీ

image

తుగ్గలి మండలం జొన్నగిరి ఎస్ఐగా విధులు నిర్వర్తించిన జయశేఖర్ ను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో కర్నూలు DSBలో ఉన్న మల్లికార్జునను జొన్నగిరి ఎస్ఐగా నియమించారు. జయశేఖర్ ను ఆదోని 3టౌన్ ఎస్ఐగా పోస్టింగ్ ఇచ్చారు. మండలంలో శాంతిభద్రతలను కాపాడడంలో జయశేఖర్ ఎంతో కృషి చేశారని మండల ప్రజలు తెలిపారు.

Similar News

News November 1, 2025

స్పెషల్ ఆఫీసర్లు మండలాలకు వెళ్లాలి: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో నియోజకవర్గ, మండల స్పెషల్ ఆఫీసర్లు ప్రతి వారం తప్పనిసరిగా మండలాలకు వెళ్లి ఆసుపత్రులు, పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ సెంటర్లు, సచివాలయాలను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో ఆమె మాట్లాడుతూ.. బీసీ హాస్టళ్లలో పదో తరగతి ఉత్తీర్ణతా శాతం పెంచాలన్నారు. హాస్టళ్లలో తాగునీరు, భోజనం, టాయిలెట్లపై చర్యలు చేపట్టాలని సూచించారు.

News October 31, 2025

సీఎం చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు సరికాదు: తిక్కారెడ్డి

image

‘మొంథా’ తుఫాను సమయంలో ప్రజలను కాపాడిన సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని జగన్ తప్పుబట్టడం ఆశ్చర్యకరమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి శుక్రవారం విమర్శించారు. తుఫాన్ సమయంలో ప్రాణ నష్టం లేకుండా చూసిన చంద్రబాబుపై వ్యాఖ్యలు చేయడం జగన్‌కు తగదన్నారు. సీఎంగా ఉన్నప్పుడు తుఫాన్లు వచ్చినా గడప దాటని జగన్, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు.

News October 31, 2025

ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచాలి: కలెక్టర్ సిరి

image

కర్నూలు జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి గురువారం అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో 91 శాఖల అధికారులతో మూడు రోజుల పాటు జరిగిన ఇంటరాక్టివ్ సెషన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. స్టాండ్ అప్ ఇండియా పథకంపై అవగాహన పెంచాలని, నాబార్డ్ ద్వారా ఆర్ఐడీఎఫ్ నిధులు వినియోగించుకోవాలని సూచించారు.