News March 18, 2025
NRPT: ‘భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలి’

కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం నారాయణపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన భూములు కోల్పోతున్న రైతుల సదస్సులో పాల్గొని మాట్లాడారు. భూసేకరణ చట్టం-2013 ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. రైతులకు నోటీసులు ఇవ్వకుండా భూసేకరణ చేయడం సరైంది కాదని అన్నారు.
Similar News
News January 20, 2026
HYDలో ఫేక్ ట్రాఫిక్ చలాన్ల కలకలం: జాగ్రత్త!

HYDలో నకిలీ ట్రాఫిక్ చలాన్ల మోసాలు పెరుగుతుండటంపై పోలీసులు ప్రజలను హెచ్చరించారు. అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండే ఫిషింగ్ లింక్‌లను నిందితులు SMS ద్వారా పంపుతున్నారు. ఆ లింక్‌లను క్లిక్ చేసి వివరాలు నమోదు చేయగానే బాధితుల బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ప్రభుత్వ సైట్లు ఎల్లప్పుడూ .gov.in లేదా .orgతో ముగుస్తాయని, SMS లింక్‌ల ద్వారా చెల్లింపులు చేయొద్దని అధికారులు సూచించారు.
News January 20, 2026
వరంగల్: SBI ఏటీఎంలో చోరీ.. నిందితుల ARREST

వరంగల్ పరిధి శంభునిపేట SBI ఏటీఎంలో జరిగిన దొంగతనం కేసులో నిందితులు యూపీకి చెందిన వినయ్ కుమార్, వినీత్ కుమార్‌ను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.1.27 లక్షల నగదు, రెండు మొబైల్స్, ఒక వీసా ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాశ్ తెలిపారు. మంగళవారం మట్వాడ ఏఎస్పీ ఆఫీస్‌లో నిందితులను మీడియాకు చూపారు. కాజీపేటకు చెందిన కాళేశ్వరవు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసును ఛేదించామన్నారు.
News January 20, 2026
నైనీ కోల్ టెండర్లపై CBIతో విచారించాలి: రాంచందర్

TG: నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వివాదంతో CM, మంత్రుల విభేదాలు బట్టబయలయ్యాయని TBJP చీఫ్ రాంచందర్ రావు విమర్శించారు. ‘బంధువులకు గనులు కేటాయించుకోవాలని చూశారు. మీడియాలో వార్తలతో టెండర్లు రద్దు చేశారు. దీనిపై CBI, మరేదైన సంస్థతో విచారించాలి’ అని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసే అర్హత BRSకు లేదన్నారు. BRS హయాం నుంచి ఇప్పటి INC GOVT వరకు జరిగిన అవినీతిపై విచారణ జరగాలని పేర్కొన్నారు.


