News March 18, 2025
వైభవంగా సీతారామచంద్ర స్వామి నిత్య కళ్యాణం

భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో మంగళవారం నిత్య కళ్యాణం వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తుల సందడి మధ్య శ్రీరాముడి కళ్యాణాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ హారతులు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
Similar News
News September 18, 2025
సీఎంతో డీఎస్సీ అభ్యర్థుల సమావేశం వాయిదా: డీఈవో

వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో శుక్రవారం అమరావతిలో జరగాల్సిన డీఎస్సీ ఉపాధ్యాయుల సమావేశం వాయిదా పడినట్లు డీఈఓ షేక్ సలీం బాషా తెలిపారు. జిల్లా కలెక్టర్ నుంచి ఈ సమాచారం అందినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎంఈఓలు డీఎస్సీ అభ్యర్థులకు తెలియజేయాలని సూచించారు. తదుపరి సమావేశం తేదీని ఇంకా నిర్ణయించలేదని, డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News September 18, 2025
వైట్ హెడ్స్ ఇలా తొలగిద్దాం..

కొందరికి చర్మంపై చిన్నగా తెల్లని మచ్చలు ఉంటాయి. అవే వైట్ హెడ్స్. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి. * కాస్త ఓట్స్ పొడిలో నీళ్లు కలిపి మెత్తని ముద్దలా చేసి సమస్య ఉన్న చోట రాయాలి.15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. * చెంచా వంటసోడాలో నీళ్లు కలిపి వైట్‌హెడ్స్ ఉన్న చోట రాయాలి. ఆ వంట సోడా పూత ఆరిపోయాక కడిగెయ్యాలి. ఇలా తరచూ చేస్తోంటే వైట్ హెడ్స్‌తోపాటు అధిక జిడ్డు సమస్య కూడా తగ్గుతుంది.
News September 18, 2025
VJA: దుర్గా మల్లేశ్వరస్వామి హుండీ ఆదాయ వివరాలు

ఇంద్రకీలాద్రిపై గత 14 రోజుల కాలానికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రూ.2,17,98,528 నగదు, 235 గ్రా. బంగారం, 1.39 కి.గ్రా. వెండి హుండీ కానుకలుగా వచ్చాయని EO శీనా నాయక్ తెలిపారు. 321 US డాలర్లు, 10 సింగపూర్ డాలర్లు, 25 UAE దిర్హమ్స్, 25 సౌదీ రియల్స్, 200 ఒమన్ బైసా కరెన్సీతో పాటు 7 ఇతర దేశాల విదేశీ కరెన్సీ ఇంద్రకీలాద్రిపై ఉన్న 48 హుండీలలో కానుకలుగా వచ్చాయన్నారు.