News March 18, 2025
సిరిసిల్ల: డ్రైవింగ్ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం

డ్రైవింగ్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజ మనోహర్ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగ బీసీ యువతీ, యువకులు ఈనెల 31 వరకు సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ డ్రైవింగ్ ఉచిత ట్రైనింగ్ హైదరాబాదులోని హకీంపేటలో ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News September 16, 2025
ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు మరో రోజు పొడిగింపు

AY 2025-26కు గానూ ITR ఫైలింగ్ గడువును ఆదాయ పన్ను శాఖ మరోసారి పెంచింది. జులై 31నే ఈ గడువు ముగియాల్సింది. దానిని SEP 15కు పొడిగించింది. ఇప్పుడు మరొక్క రోజు(సెప్టెంబర్ 16 వరకు) పెంచింది. ట్యాక్స్ ఫైలింగ్ పోర్టల్‌లో టెక్నికల్ గ్లిట్చ్ కారణంగా ఫైలింగ్‌కు చాలామంది ఇబ్బందులు పడినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే గడువును పొడిగించినట్లు తెలస్తోంది. గడువులోగా ఫైలింగ్ పూర్తి చేయాలని అధికారులు సూచించారు.
News September 16, 2025
ట్రంప్ హింట్.. అమెరికా చేతికి TikTok!

సెప్టెంబర్ 17కల్లా టిక్ టాక్ పగ్గాలు అమెరికా చేతికి రాకపోతే ఆ యాప్‌ను తమ దేశంలో బ్యాన్ చేస్తామని US ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై చైనా-అమెరికా ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ‘దేశంలోని యువత ఎంతగానో కోరుకుంటున్న ఓ డీల్ దాదాపుగా పూర్తైంది’ అని అధ్యక్షుడు ట్రంప్ పోస్ట్ చేశారు. త్వరలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడనున్నారు. డీల్ కోసం ఫ్రేమ్ వర్క్ కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
News September 16, 2025
సంగారెడ్డి: ఇన్‌స్పైర్ నామినేషన్ గడువు పెంపు

ఇన్‌స్పైర్ అవార్డ్స్ (Inspire Awards) నామినేషన్ గడువును సెప్టెంబర్ 30 వరకు పెంచినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా, విద్యార్థులకు సహకరించిన ప్రధానోపాధ్యాయులు, గైడ్ టీచర్లు, జిల్లా, డివిజన్, మండల మానిటరింగ్ కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.