News March 18, 2025

పెద్ద దేవళాపురం@42.7 డిగ్రీలు

image

AP: ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. నంద్యాల జిల్లా పెద్ద దేవళాపురంలో అత్యధికంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉలిందకొండలో 42.6, ఖాజీపేటలో 41.8, దరిమడుగులో 41.5, నాగసముద్రం, వత్తలూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల పైనే నమోదవడం గమనార్హం. అలాగే 7 మండలాల్లో తీవ్ర వడగాలులు, 42 మండలాల్లో వడగాలులు వీచాయని APSDMA వెల్లడించింది.

Similar News

News December 31, 2025

ధనుర్మాసం: పదహారో రోజు కీర్తన

image

‘మా ప్రభువైన నందగోపుని భవన రక్షకుడా! మాకు లోనికి వెళ్లే అనుమతివ్వు. మేము గొల్లభామలం, కృష్ణుని దర్శించి సుప్రభాత సేవ చేయడానికి పరిశుద్ధులమై వచ్చాం. ఇంద్రనీల మణివర్ణము గల ఆ స్వామి, మాకు వాద్యము నిస్తానని వాగ్దానం చేశాడు. మేము అజ్ఞానులమైనా ఆయనపై అపారమైన ప్రేమ కలిగిన వారం. కాబట్టి మమ్ములను అడ్డుకోకుండా ఆ మణుల గడియను తెరిచి, స్వామిని చేరుకునేందుకు సహకరించమని ద్వారపాలకుడిని వేడుకుంటున్నాం. <<-se>>#DHANURMASAM<<>>

News December 31, 2025

2025లో చివరి రోజు.. మీ గోల్స్ సాధించారా?

image

కాలచక్రం గిర్రున తిరిగింది. 2025 ముగింపుకొచ్చింది. ఇంకో రోజే మిగిలింది. ఇల్లు కట్టుకోవాలని, కారు/బైక్ కొనాలని, ఉద్యోగం సాధించాలని ఇలా ఎన్నో గోల్స్ పెట్టుకుని ఉంటారు. మరోవైపు జిమ్/రన్నింగ్ చేయాలని, డ్రింక్/స్మోకింగ్ మానేస్తానని, కొత్త ప్రదేశాలు చుట్టిరావాలని, రోజూ డైరీ రాయాలని ఇంకెన్నో రెజల్యూషన్స్ అనుకుని ఉంటారు. మరి మీరు పెట్టుకున్న గోల్స్‌ను సాధించారా? రెజల్యూషన్స్ కొనసాగించారా? కామెంట్ చేయండి.

News December 31, 2025

ఇవాళ డెలివరీ బాయ్స్ సమ్మె.. కంపెనీల బెదిరింపులు!

image

స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర సంస్థల డెలివరీ ఏజెంట్లు ఇవాళ <<18710950>>సమ్మె<<>> చేయనున్నారు. 1.5 లక్షల మంది ఇందులో పాల్గొంటారని యూనియన్లు చెబుతున్నాయి. అయితే డెలివరీ బాయ్స్‌ను కంపెనీలు బెదిరిస్తున్నట్లు ఆరోపిస్తున్నాయి. మళ్లీ పనిలోకి రాకుండా IDలు బ్లాక్ చేస్తామని హెచ్చరిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు వర్క్ కొనసాగించాలని కొన్ని కంపెనీలు సెలబ్రిటీలతో యాడ్స్ చేయించాయి.