News March 18, 2025

పెద్దపల్లి: నేడు ఇంటర్మీడియట్ పరీక్షలకు 111మంది గైర్హాజరు

image

పెద్దపల్లి జిల్లాలో మంగళవారం ఇంటర్మీడియట్ రెండోవ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని జిల్లా నోడల్ అధికారి కల్పన పేర్కొన్నారు. ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్లకు పరీక్షలు జరిగాయన్నారు. 4927 విద్యార్థులకు 4816 హాజరయ్యారని  పేర్కొన్నారు. 111 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఈ పరీక్షల్లో జనరల్ 71 మంది, వొకేషనల్ 40మంది విద్యార్థులు హాజరుకాలేదన్నారు.

Similar News

News September 18, 2025

NTR: రూ.42 లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

image

డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు సింగ్‌నగర్‌కు చెందిన వృద్ధుడిని మోసం చేశారు. ఈ నెల 11న సైబర్ నేరగాళ్లు సత్యనారాయణ మూర్తికి ఫోన్ చేసి భయపెట్టారు. ఈ క్రమంలో అతని బ్యాంకు ఖాతాల నుంచి ఏకంగా రూ.42 లక్షలు కొట్టేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ తరహా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

News September 18, 2025

చేతిలో బిట్ కాయిన్‌తో ట్రంప్ విగ్రహం

image

క్రిప్టో కరెన్సీకి మద్దతిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌ విగ్రహాన్ని ఇన్వెస్టర్లు ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ DCలోని యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ బయట 12 అడుగుల ట్రంప్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చేతిలో బిట్ కాయిన్‌తో బంగారు వర్ణంలో ఈ విగ్రహం ఉంది. దీన్ని వెండి, అల్యూమినియంతో తయారు చేసి, బంగారు పూత వేసినట్లు తెలుస్తోంది. ఫెడరల్ రిజర్వు వడ్డీ <<17745765>>రేట్లు<<>> తగ్గించిన కాసేపటికే దీన్ని ఆవిష్కరించారు.

News September 18, 2025

NLG: ఆర్టీసీలో ‘యాత్రా దానం’.. దాతలు ముందుకు వచ్చేనా?

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు తీర్థయాత్రల కోసం ప్రయాణికులకు బస్సు సదుపాయాలు కల్పించిన ఆర్టీసీ ప్రస్తుతం ‘యాత్రా దానం’ పేరిట కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ఆదాయం సమకూర్చుకోవడంతో పాటు పేద, వృద్ధులు, దివ్యాంగుల తీర్థయాత్రలకు బస్సు సర్వీసులు నడపనుంది. దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.