News March 18, 2025

తల్లి, సోదరుడి శవాలతో నెల రోజులుగా ఇంట్లోనే..

image

AP: తల్లి, సోదరుడి మృతదేహాలతో ఓ వ్యక్తి నెల రోజులుగా ఇంట్లోనే ఉంటున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కడప శాటిలైట్ సిటీలో నివాసముంటున్న వృద్ధురాలికి ఇద్దరు కొడుకులు(45,55 ఏళ్లు) ఉన్నారు. నెల కిందట ఆమె చనిపోగా, ఓ కొడుకు ఉరేసుకున్నాడు. ఈ ఇద్దరు కుమారులు ఎవరితో మాట్లాడేవారు కాదు. దీంతో ఆ ఇంటి నుంచి దుర్వాసన వచ్చే దాకా విషయం బయటకు రాలేదు. స్థానికులు మానసిక స్థితి లేని మరో కుమారుడిని ఆశ్రమానికి తరలించారు.

Similar News

News July 4, 2025

దేశ వ్యతిరేక పోస్టులపై కఠిన చర్యలు?

image

దేశానికి వ్యతిరేకంగా కంటెంట్ క్రియేట్ చేసే వారికి చుక్కలు చూపించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం కేంద్ర హోంశాఖ కొత్త పాలసీని రూపొందిస్తున్నట్లు సమాచారం. వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో పెట్టే కంటెంట్‌ను పరిశీలించి, దేశ వ్యతిరేక పోస్టులను గుర్తించేందుకు ఓ టీమ్‌ను ఏర్పాటు చేయనుంది. ఆయా అకౌంట్లను బ్లాక్ చేయడంతో పాటు పోస్ట్ చేసిన వారిపైనా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి.

News July 4, 2025

AI ద్వారా భూ సమస్యల పరిష్కారం: మంత్రి అనగాని

image

AP: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూములను ఆధార్, సర్వే నంబర్లతో లింక్ చేస్తామని చెప్పారు. ‘రైతులకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సలహాలు ఇస్తున్నాం. గ్రీవెన్స్ ద్వారా ఇప్పటివరకు 4.63 లక్షల ఫిర్యాదులు రాగా 3.99 లక్షల ఫిర్యాదులు పరిష్కరించాం. త్వరలోనే మిగతా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.

News July 4, 2025

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. sensex 193 పాయింట్ల లాభంతో 83,432 వద్ద స్థిరపడింది. nifty 55 పాయింట్లు లాభపడి 25,461 వద్ద ట్రేడింగ్ ముగించింది. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ, విప్రో, అల్ట్రాటెక్, రిలయన్స్, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకి, ఇండస్ ఇండ్, అదానీ పోర్ట్స్ M&M షేర్లు నష్టపోయాయి.