News March 18, 2025
పానగల్: విద్యార్థులు పెద్ద కలలు కనండి: జిల్లా ఎస్పీ

పానగల్ మండలం మహమ్మదాపూర్ ఉన్నత పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవం,10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్,జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ గోవర్ధన్ సాగర్ హాజరయ్యారు. పాఠశాల జీహెచ్ఎం ఆనంద్,ఉపాధ్యాయ బృందం, మాజీ సర్పంచ్ జయరాములు సాగర్ వారికి స్వాగతం పలికారు. ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు పెద్ద కలలు కని, వాటిని సాధించాలన్నారు.
Similar News
News March 19, 2025
వర్సిటీకి ఇక మిగిలేది కేవలం 1400 ఎకరాలే!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) కోసం ప్రభుత్వం 1974లో 2300 ఎకరాలు కేటాయించింది. అయితే వర్సిటీ ఏర్పాటైన 50 ఏళ్లలో వివిధ అవసరాల కోసం 500 ఎకరాలను వెనక్కుతీసుకున్నారు. ఆ తరువాత ఆ భూముల జోలికి రాలేదు. ఇపుడు మరోసారి ప్రభుత్వం HCU వద్ద 400 ఎకరాల లాగేసే ప్రయత్నం చేస్తోంది. అలా చేస్తే ఇక హెచ్సీయూ వద్ద మిగిలేది కేవలం 1400 ఎకరాలే.
News March 19, 2025
ఒంగోలు: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మక విద్య అందడమే లక్ష్యంతో పనిచేస్తున్నదని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ విద్యా శాఖాధికారులతో సమావేశమై G.O 117, డ్రాప్ అవుట్స్ తదితర అంశాలపై సమీక్షించి, పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జీవో 117ను ఉపసంహరించిన తర్వాత ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రక్రియను విద్యాశాఖ ప్రారంభించిందన్నారు.
News March 19, 2025
హృతిక్ విషయంలో ఫీలయ్యే వాడిని: రాకేశ్ రోషన్

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ బాల్యం గురించి ఆయన తండ్రి రాకేశ్ రోషన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హృతిక్‌కు చిన్నప్పుడు నత్తి ఉండేదని దీంతో ఏ విషయం చెప్పాలన్నా సందేహించేవాడని అన్నారు. ఆ విషయంలో హృతిక్‌ను చూసి ఫీలయ్యే వాడినని రాకేశ్ రోషన్ తెలిపారు. అయితే నత్తిని అధిగమించేందుకు రోజూ ఉదయం గంట పాటు వివిధ భాషల పత్రికలు గట్టిగా చదివేవాడని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.