News March 18, 2025
కృష్ణా: లబ్ధిదారుల పురోభివృద్ధికి తోడ్పడండి: కలెక్టర్

లబ్ధిదారులకు విరివిగా రుణాలు అందించి వారి పురోభివృద్ధికి తోడ్పడాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల సమితి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పంట సాగు చేస్తూ సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులకు వారి పంట మీద తప్పనిసరిగా రుణాలు అందించాలని సూచించారు.
Similar News
News October 29, 2025
మచిలీపట్నం: ఈదురుగాలులకు ఇల్లు నేలమట్టం

మొంథా తుపాను తీవ్ర ప్రభావంతో మచిలీపట్నం 29వ డివిజన్ పరిధిలోని చింతపండుపాలెంలో ఒక పాతగృహం పూర్తిగా కూలిపోయింది. తుపాను కారణంగా వీచిన భారీ ఈదురుగాలుల వేగం ఎక్కువగా ఉండటమే ఈ సంఘటనకు కారణమని స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తూ ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందిన వెంటనే అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి, నష్టం వివరాలు సేకరిస్తున్నారు.
News October 28, 2025
కృష్ణా: చేనేత కార్మికుల జీవితాలు చీకట్లోకి.!

ఏడాదిగా చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో మగ్గాల లోపల నీరు చేరి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా చేనేత కార్మికులు పనిలేక అర్ధకలితో రోజులు గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సొసైటీలు కూడా కార్యకలాపాలు కొనసాగించలేని స్థితిలోకి వెళ్లిపోయాయి. ప్రభుత్వం త్రిఫ్ట్ ఫండ్, యార్న్ సబ్సిడీ బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల జీవనోపాధి దెబ్బతింటోందని పేర్కొన్నారు.
News October 28, 2025
కృష్ణా: నేడు సినిమా థియేటర్లు మూసివేత

మొంథా తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం ఒక్క రోజు జిల్లాలోని అన్ని సినిమా హాల్స్‌ను మూసి వేయాలని కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎటువంటి సినిమా ప్రదర్శనలు వేయకుండా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లను ఆదేశించారు. తుపాన్ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ సమయంలో ప్రజలంతా తమ తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలన్నారు.


