News March 18, 2025

OTTలోకి కొత్త సినిమాలు

image

తమిళ హీరో ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమా ఈనెల 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. దీనితో పాటు మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ నెట్‌ఫ్లిక్స్‌లో ఈనెల 20 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మూవీ తెలుగులో ఈనెల 14న థియేటర్లలో రిలీజైంది. వారం రోజుల్లోనే OTT బాట పట్టింది. ఈనెల 21 నుంచి ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కూడా నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది.

Similar News

News March 19, 2025

హృతిక్ విషయంలో ఫీలయ్యే వాడిని: రాకేశ్ రోషన్

image

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ బాల్యం గురించి ఆయన తండ్రి రాకేశ్ రోషన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హృతిక్‌కు చిన్నప్పుడు నత్తి ఉండేదని దీంతో ఏ విషయం చెప్పాలన్నా సందేహించేవాడని అన్నారు. ఆ విషయంలో హృతిక్‌ను చూసి ఫీలయ్యే వాడినని రాకేశ్ రోషన్ తెలిపారు. అయితే నత్తిని అధిగమించేందుకు రోజూ ఉదయం గంట పాటు వివిధ భాషల పత్రికలు గట్టిగా చదివేవాడని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.

News March 19, 2025

నేడు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి

image

TG: ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క నేడు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో 2025-26 కు సంబంధించి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ ఏడాది పద్దులు రూ.3లక్షల కోట్లకు పైగానే ఉండనున్నట్లు సమాచారం. 2024-25 పద్దు రూ.2.90 లక్షల కోట్లు కాగా ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ ఇదే.

News March 19, 2025

యాదగిరిగుట్టలో మిస్‌ వరల్డ్

image

TG: యాదగిరిగుట్ట నరసింహస్వామి క్షేత్రాన్ని మిస్‌ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా దర్శించుకున్నారు. భారతీయత ఉట్టిపడేలా బొట్టు పెట్టుకొని, సంప్రదాయ చీరలో కనిపించారు. ఆలయ నిర్మాణ శైలికి ముగ్ధులయ్యారు. నరసింహుడిని దర్శించుకోవడం ఆనందాన్నిస్తోందన్నారు. కాగా చెక్ రిపబ్లికన్‌కు చెందిన ఈమె 2024లో టైటిల్ గెలిచారు. ఇక ఈ ఏడాది మే 7 నుంచి 31 వరకు HYDలో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి.

error: Content is protected !!