News March 18, 2025
రన్యారావు కేసులో వెలుగులోకి కీలక విషయాలు

బంగారం స్మగ్లింగ్ చేస్తూ అరెస్టైన కన్నడ నటి రన్యారావు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె తన స్నేహితుడు తరుణ్ రాజుతో 26 సార్లు దుబాయ్ వెళ్లినట్లు, ఆ సమయంలోనూ స్మగ్లింగ్ చేసినట్లు DRI కోర్టు విచారణలో పేర్కొంది. ఆ సమయంలో వీరిద్దరూ ఉదయం బయలుదేరి సాయంత్రం తిరిగొచ్చేవారంది. దుబాయ్లో రాజు ఆర్థిక లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నట్లు, అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు వివరించింది.
Similar News
News March 19, 2025
రోదసిలో అధిక కాలం ఉంటే వచ్చే ఆరోగ్య సమస్యలివే

గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల శారీరక శ్రమ ఉండదు. తద్వారా కండరాలు, ఎముకలలో క్షీణత మెుదలవుతుంది. భార రహిత స్థితి వల్ల చెవిలోని వెస్టిబ్యులర్ అవయవానికి అందే సమాచారం మారిపోతుంది దీంతో మెదడు సరిగ్గా పనిచేయదు. శరీరంలోని పైభాగంలో, తలలో రక్తం పేరుకుపోతోంది. తెల్ల రక్తకణాలు తగ్గే ప్రమాదముండటంతో రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. అధిక రేడియో ధార్మికత వల్ల దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవ్వచ్చు.
News March 19, 2025
భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్

వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా భూమిపై ల్యాండ్ కావడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. 8 రోజుల్లో తిరిగొస్తామని వెళ్లి 286 రోజులకు హీరోచితంగా భూమిపైకి వచ్చిన వారికి సుస్వాగతం పలికారు. వీరి కథ అడ్వేంచర్ మూవీకి ఏ మాత్రం తీసిపోదని, బ్లాక్ బస్టర్ అని రాసుకొచ్చారు. సునీత, బుచ్ మరింత శక్తిని పొందాలని ఆకాంక్షించారు.
News March 19, 2025
మహేశ్, రాజమౌళి వర్కింగ్ టైటిల్ ఫిక్స్!

రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న SSMB29 ఒడిశా షెడ్యూల్ షూటింగ్ పూర్తైంది. ఈ మేరకు గౌరవ ఆతిథ్యాన్ని అందించిన అక్కడి యంత్రాంగానికి స్పెషల్ థాంక్స్ చెబుతూ రాజమౌళి రాసిన నోట్ వైరలవుతోంది. ఇందులో జక్కన్న వర్కింగ్ టైటిల్ను SSMB29గా పేర్కొనడం గమనార్హం. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఖుషి అవుతున్నారు. కాగా ఈ మూవీలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నారు.