News March 18, 2025

విశాఖ మేయర్ పీఠాన్ని కాపాడుకుంటాం: కన్నబాబు

image

AP: విశాఖ మేయర్ పీఠంపై <<15799147>>కూటమి కన్నేయడంతో<<>> వైసీపీ అప్రమత్తమైంది. ఇవాళ కార్పొరేటర్లతో ఉత్తరాంధ్ర సమన్వయకర్త కన్నబాబు సమావేశయ్యారు. ఈ భేటీకి 34 మంది హాజరుకాగా, ముగ్గురు రాలేదు. తమ కార్పొరేటర్లను ప్రలోభపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. మేయర్ స్థానాన్ని కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. చీప్ పాలిటిక్స్ మానుకోవాలని CBNకు మాజీ మంత్రి అమర్నాథ్ హితవు పలికారు.

Similar News

News March 19, 2025

భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్

image

వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా భూమిపై ల్యాండ్ కావడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. 8 రోజుల్లో తిరిగొస్తామని వెళ్లి 286 రోజులకు హీరోచితంగా భూమిపైకి వచ్చిన వారికి సుస్వాగతం పలికారు. వీరి కథ అడ్వేంచర్ మూవీకి ఏ మాత్రం తీసిపోదని, బ్లాక్ బస్టర్ అని రాసుకొచ్చారు. సునీత, బుచ్ మరింత శక్తిని పొందాలని ఆకాంక్షించారు.

News March 19, 2025

మహేశ్, రాజమౌళి వర్కింగ్ టైటిల్ ఫిక్స్!

image

రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న SSMB29 ఒడిశా షెడ్యూల్ షూటింగ్ పూర్తైంది. ఈ మేరకు గౌరవ ఆతిథ్యాన్ని అందించిన అక్కడి యంత్రాంగానికి స్పెషల్ థాంక్స్ చెబుతూ రాజమౌళి రాసిన నోట్ వైరలవుతోంది. ఇందులో జక్కన్న వర్కింగ్ టైటిల్‌ను SSMB29గా పేర్కొనడం గమనార్హం. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఖుషి అవుతున్నారు. కాగా ఈ మూవీలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నారు.

News March 19, 2025

సునీతా విలియమ్స్ ఫ్యామిలీ గురించి తెలుసా?

image

సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యది గుజరాత్‌లోని ఝులసన్ గ్రామం. 1957లో M.D. పూర్తి చేసిన ఆయన అమెరికాకు వెళ్లి విద్యను అభ్యసించారు. అక్కడే వివిధ ఆస్పత్రులు, రీసెర్చ్ సెంటర్లలో పని చేశారు. స్లోవేనియన్-అమెరికన్ అయిన ఉర్సులిన్ బోనీ జలోకర్‌ను పెళ్లి చేసుకున్నారు. సునీత నేవీలో చేరినప్పుడు పరిచయమైన ఫెడరల్ మార్షల్ మైఖేల్ జె.విలియమ్స్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు పిల్లలు లేరు.

error: Content is protected !!