News March 18, 2025

సత్యసాయి: ‘ఆధార్ నమోదులో తప్పులు దొర్లరాదు’

image

ఆధార్ నమోదులో ఎలాంటి తప్పులు జరగకూడదని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయంలో ఆధార్ నమోదుపై జిల్లా కమిటీతో సమావేశం నిర్వహించారు. ఐదేళ్లలోపు పిల్లలకు వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్, జిఎస్‌డబ్ల్యూ, పోస్టల్ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆధార్ కేంద్రాలలో నమోదు చేయాలని సూచించారు.

Similar News

News December 25, 2025

బంగ్లాదేశ్‌లో హిందువుల ఇళ్లకు నిప్పు..

image

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గడిచిన 5 రోజుల్లో 7 హిందూ కుటుంబాలపై <<18670618>>నిరసనకారులు<<>> దాడి చేసినట్టు తెలుస్తోంది. 2 ఇళ్లకు నిరసనకారులు నిప్పుపెట్టిన ఘటనలో 8 మంది త్రుటిలో తప్పించుకున్నారు. ఈ దాడి చేసినట్టు అనుమానిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితం కూడా హిందువుల ఇంటిపై నిరసనకారులు దాడి చేశారు.

News December 25, 2025

అనంత: స్నేహితుల మధ్య గొడవ.. కత్తితో దాడి

image

అనంతపురంలోని కమల నగర్‌కు చెందిన స్నేహితులు జనార్దన్, సుధాకర్ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. క్రిస్మస్ పండగ సందర్భంగా ఇద్దరూ కలిసి వాళ్ల మిత్రుడు ఇంటికి భోజనానికి వెళ్లారు. వారిద్దరి మధ్య మాట-మాట పెరగడంతో జనార్దన్ తన స్నేహితుడు సుధాకర్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సుధాకర్‌ను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 25, 2025

క్రీస్తు లోక రక్షకుడు: చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరులోని లక్ష్మీనగర్ కాలనీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. బీట్టీ మెమోరియల్ చర్చ్‌లో రేవ శామ్వేల్ ఆర్థర్ అధ్యక్షతన ప్రార్థనలు చేశారు. ఈ వేడుకలకు కలెక్టర్ సుమిత్ కుమార్ కుటుంబ సభ్యులతో కలసి హాజరయ్యారు. లోక రక్షకుడైన క్రీస్తు జన్మదిన వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. క్రీస్తు లోక రక్షకుడని, ఆయన జననం లోకానికి సమాధానమని తెలిపారు.