News March 18, 2025

సీఎం తిరుపతి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

image

సీఎం చంద్రబాబు ఈనెల 20, 21వ తేదీల్లో తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. 20వ తేదీ తిరుపతి మీదుగా తిరుమల చేరుకుంటారు. 21వ తేదీ శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. రేణిగుంట విమానాశ్రయంలో అధికారులతో సమీక్షించారు. సీఎం పర్యటనలో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలను అధికారులకు వివరించారు.

Similar News

News March 19, 2025

MBNR: పోక్సో కేసు.. నిందితుడికి జీవిత ఖైదు

image

ఓ నిందితుడికి పోక్సోకేసులో జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పుఇచ్చారు. 2020డిసెంబర్21న కోయిలకొండ PSలో దుప్పుల ఆనంద్ 14ఏళ్ల బాలికను అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు.  బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సోకేసు నమోదుచేశారు. నేరం రుజువవటంతో నిందితుడికి జీవితఖైదు, రూ.50వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రాజేశ్వరి తీర్పుఇచ్చారు. దీంతో ఎస్పీ జానకి PP, పోలీస్ సిబ్బందిని అభినందించారు.

News March 19, 2025

వై.రామవరం: పూడ్చిపెట్టిన మృతదేహానికి పోస్టుమార్టం

image

వై.రామవరం మండలం పెద్దఊలెంపాడులో మంగళవారం పూడ్చిపెట్టిన బాలుడి మృతదేహానికి ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోస్టుమార్టం జరిగింది. ఈ నెల8న 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో పెద్దఊలెంపాడుకు చెందిన జాస్విక్ రెడ్డి(3) మృతి చెందాడు. 9న మృతదేహాన్ని ఖననం చేశారు. గ్రామస్థుల సూచనతో బాలుడి తల్లి మార్చి 17వతేదీ రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోస్టుమార్టం చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.

News March 19, 2025

BNGR: కేటాయింపులు సానుకూలంగా ఉంటాయా..!

image

రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులకు రూ.200 కోట్ల పరిహారం రావాల్సి ఉంది. బునాదిగానికాల్వ, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, మూసీ కాలువల ఆధునికీకరణకు నిధులు కేటాయించాల్సి ఉంది. గందమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి బడ్జెట్ కేటాయింపులపై ఆయకట్టు రైతులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. 

error: Content is protected !!