News March 19, 2025
VKB: జిల్లాలో నేటి..TOP NEWS!!

✔పలుచోట్ల ఇఫ్తార్ విందు..పాల్గొన్న నేతలు
✔BC,SC బిల్లులకు ఆమోదం.. జిల్లా నేతల సంబరాలు
✔సిద్ధం.. 21 నుండి టెన్త్ పరీక్షలు:MEOలు
✔పరిగి: బొలోరో వాహనాన్ని ఢీ కొట్టిన కారు
✔VKB: ఆర్టీసీ డిపోకు 16 కొత్త బస్సులు
✔VKB: 21 నుంచి ఏప్రిల్ 3 వరకు పది పరీక్షలు: కలెక్టర్
✔ఇంటర్ పరీక్షలకు 178 మంది గైర్హాజరు
✔VKB: ఆదివాసీ కాంగ్రెస్ శిక్షణ తరగతులు ప్రారంభం
Similar News
News November 4, 2025
దెందులూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

దెందులూరు మండలం సత్యనారాయణపురం 16 నంబర్ జాతీయ రహదారిపై వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని ఎస్ఐ శివాజీ మంగళవారం తెలిపారు. ఏలూరు గుండుగొలను మార్గంలో సత్యనారాయణపురం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుని వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసినవారు దెందులూరు పోలీసులకు తెలియజేయాలన్నారు.
News November 4, 2025
మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై కలెక్టర్ సమీక్ష

జీఎస్‌ఐ ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పనను సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై మంగళవారం కలెక్టరేట్‌లో అవగాహన కార్యక్రమం జరిగింది. సంబంధిత శాఖల అధికారులు ఖచ్చితమైన వివరాలను సమయానికి అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 4, 2025
వరద నష్టం నివేదిక తక్షణమే ఇవ్వాలి: కలెక్టర్

జిల్లాలో భారీ వర్షాల వల్ల పంటలు, ఆస్తులు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాలను తక్షణం నమోదు చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో వరదల ప్రభావం, పునరుద్ధరణపై ఆమె సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ముంపు సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.


