News March 24, 2024
కృష్ణా: డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక

కృష్ణా వర్సిటీ పరిధిలోని డిగ్రీ (2020- 21 బ్యాచ్) విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 2 నుంచి 18 వరకు ఈ పరీక్షలు నిర్ణీత తేదీల్లో జరుగుతాయి. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, పరీక్షల టైం టేబుల్ పూర్తి వివరాలకు విద్యార్థులు https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం స్పష్టం చేసింది.
Similar News
News April 18, 2025
బాపులపాడు: మార్కెట్‌కి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరి మృతి

బాపులపాడు మండలం వేలేరు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేలేరు వద్ద కారు ఢీ కొనడంతో బైక్‌పై వెళ్తున్న బాబు అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇతను తేలప్రోలులో పట్టుగూళ్ల రీలింగ్ యూనిట్‌ని నిర్వహిస్తుంటాడు. పట్టుగూళ్ల కోసం హనుమాన్ జంక్షన్ మార్కెట్‌కు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
News April 18, 2025
ఘంటసాల: అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు..!

ఘంటసాల పరిధిలోని పాప వినాశనం వద్ద విషాదం చోటుచేసుకుంది. గురువారం KEB కాలువలో పదో తరగతి విద్యార్థి పవన్ గల్లంతయ్యాడు. దురదృష్టవశాత్తూ ఇదే స్థలంలో 11 ఏళ్ల క్రితం పవన్ తండ్రి కూడా మృతి చెందారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న కుమారుడు కాలువలో కొట్టుకుపోవడంతో తల్లి గుండెలు అవిసేలా రోధిస్తోంది. గ్రామస్థులు పవన్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
News April 18, 2025
హనుమాన్ జంక్షన్‌లో తనిఖీలు చేసిన ఎస్పీ

రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు గురువారం రాత్రి జిల్లావ్యాప్తంగా పోలీసులు నాకాబందీ నిర్వహించారు. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెరికేడు అండర్ పాస్ వద్ద జరిగిన నాకాబందిలో పాల్గొన్న జిల్లా ఎస్పీ గంగాధరరావు స్వయంగా వాహన తనిఖీలు చేశారు. వాహన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి వారు ఎక్కడ నుంచి వస్తున్నది అడిగి తెలుసుకున్నారు.