News March 19, 2025
నర్వ: ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

నర్వ మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ల్యాబ్, ప్రసూతి గది, ఇన్ పేషంట్ వార్డులను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి గదిలో బేబి వార్మ్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో పెట్టాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు.
Similar News
News March 19, 2025
వరంగల్: సెల్ ఫోన్ లైట్లతో దహన సంస్కారాలు!

సెల్‌ఫోన్ లైట్లతో దహన సంస్కారాలు చేసిన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరిలో జరిగింది. స్థానికుల ప్రకారం.. మండల కేంద్రంలో ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరణించాడు. సమయం దాదాపు రాత్రి 7 గంటలు కావడంతో సెల్‌ఫోన్ లైట్లతో దహన సంస్కారాలు నిర్వహించారు. దీంతో అక్కడ ఎలాంటి విద్యుత్ ఏర్పాట్లు లేవని, ఇలాంటి పరిస్థితుల్లో స్నానాలు చేస్తుండగా అనుకోని ప్రమాదం జరిగితే బాధ్యులెవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
News March 19, 2025
సంగారెడ్డి: టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 21 నుంచి జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలో 122 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 22,411 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులు పరీక్షలు ప్రశాంతంగా రాయాలని సూచించారు.
News March 19, 2025
MBNR: GET READY.. టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిఘా పెట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా 60 పరీక్ష కేంద్రాల్లో 12,300 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష జరుగుతుందని అన్నారు.