News March 19, 2025
NLG: ఈనెల 22న ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

నల్లగొండ జిల్లాలో వివిధ సమస్యలతో బాధపడుతున్న వయోవృద్దులు, దివ్యాంగుల కోసం ఈనెల 22న నల్గొండ కలెక్టరేట్లో ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సాయంత్రం 3గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని వృద్ధులు, దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
Similar News
News March 19, 2025
NLG: మఖానా సాగుపై కసరత్తు

జిల్లాలో మఖానా సాగు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బిహార్‌లో మాత్రమే రైతులు చేస్తున్న మఖానా సాగుపై జిల్లా అధికారుల బృందం అధ్యయనం చేసింది. ఆ నివేదిక ఆధారంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి చొరవతో జిల్లాలోని ఐదు కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా వానాకాలం నుంచి మఖానా సాగు చేయించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖల పర్యవేక్షణలో కార్యాచరణ రూపొందించారు.
News March 19, 2025
నల్గొండ: బడ్జెట్లో వరాలు కురిపిస్తారా..!

రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలోని 11 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే డిండి ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి నిధుల కేటాయింపుపై ఆయకట్టు రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఎంజీ యూనివర్సిటీ అభివృద్ధి, ఏఎంఆర్పీ పరిధిలోని కాలువల ఆధునీకరణకు నిధులు కేటాయించాల్సి ఉంది. పాత ఎత్తిపోతల పథకాలకు ఫండ్స్ ఇవ్వాలన రైతులు కోరుతున్నారు.
News March 19, 2025
NLG: జీపీ కార్మికుల వేతన వెతలు

నల్గొండ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు రాక ఆర్థిక కష్టాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ కార్మికుల పట్టించుకునే నాథులే లేక దుర్భరమైన బతుకులు.. ఇది NLG జిల్లాలో 856 గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య కార్మికుల దుస్థితి. సకాలంలో వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. 3నెలలుగా వేతనాలు పెండింగ్‌లో పెట్టడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు.