News March 19, 2025

మందమర్రి ఏరియాలో 1972కారుణ్య నియామకాలు:GM

image

మందమర్రి ఏరియాలో 40 మందికి కారుణ్య నియామకపత్రాలను ఏరియా జీఎం దేవేందర్ మంగళవారం అందజేశారు. అనంతరం జీఎం మాట్లాడుతూ.. ఏరియాలో ఇప్పటివరకు 1972 మందికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు ఇప్పించామని పేర్కొన్నారు. ఉద్యోగులు విధులకు గైర్హాజరు కాకుండా బొగ్గు ఉత్పత్తికి సహకరించాలని ఆయన సూచించారు.

Similar News

News March 19, 2025

కొల్లేరు సరిహద్దులు గుర్తింపు.. వారందరిలో ఆందోళన

image

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొల్లేరు సరిహద్దులను గుర్తించే ప్రక్రియను అధికారులు ముమ్మరంగా చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో ఉంటున్న వారంతా ఆందోళనకు గురవుతున్నారు. ప్రజాప్రతినిధులను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తమ జీవనోపాధికి ఆటంకం లేకుండా చూడాలని వేడుకుంటున్నారు. ఈ సర్వే ఇంకా పూర్తి కావాల్సి ఉంది. సర్వే పూర్తయి నివేదిక పరిశీలించిన తర్వాత సుప్రీం ఏం చేయబోతుందన్నదనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

News March 19, 2025

NRPT: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

నారాయణపేట మండలం జలాల్‌పూర్ గ్రామ స్టేజీ సమీపంలో బుధవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా హత్య చేశారా, లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 19, 2025

గుర్ల: పాము కాటుతో ఇంటర్ విద్యార్ధిని మృతి

image

పాము కాటుతో ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన విజయనగరం జిల్లా గుర్ల మండలం ఫకీర్ కిట్టలి పంచాయతీ బూర్లే పేటలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ద్వారపూడి మౌనిక అనే విద్యార్థినికి అర్ధరాత్రి ఇంటివద్దనే నాగుపాము కాటువేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. మార్గ మధ్యంలోనే ఆమె మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!