News March 19, 2025
ఖమ్మం: ‘రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకం కింద గిరిజన నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమశాఖ డీడీ విజయలక్ష్మి తెలిపారు. TGOBMMSNEW.CGG.GOV.IN వెబ్ సైట్ ద్వారా ఏప్రిల్ 5లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.మరిన్ని వివరాలకు కలెక్టరేట్లోని ఉప డైరెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం నందు సంప్రదించాలని కోరారు.
Similar News
News March 19, 2025
బూర్గంపాడ్: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలంలో జరిగింది. భద్రాచలం క్రాస్ రోడ్డు సమీపంలోని రాంపురం వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రాంపురం గ్రామస్థుడిగా గుర్తించినట్లు సమాచారం.
News March 19, 2025
మత్కేపల్లిలో రూ.1.50లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సిఫారసు మేరకు మత్కేపల్లి గ్రామానికి చెందిన బండి స్వాతి రూ.60,000, పగడాల శీను రూ.40,000, పగడాల బాబురావు రూ. 50,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో చింతకాని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News March 19, 2025
నేడే బడ్జెట్.. ఖమ్మం ప్రజల గంపెడు ఆశలు..!

నేడు అసెంబ్లీలో ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఖమ్మం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పాలేరు ఇంజినీరింగ్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిధులు, సీతారామ ప్రాజెక్టు లింకు కెనాల్, ఖమ్మం మెడికల్ కాలేజ్, రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. ఖమ్మం నుంచే ముగ్గురు మంత్రులు ఉండటంతో నిధులు దండీగా వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.