News March 19, 2025
నీటిఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు: కలెక్టర్

తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరాను బలోపేతం చేయాలని, లీకేజీలను వెంటనే సరిచేయాలన్నారు. బోర్లు, పంపుల మరమ్మతులు చేయాలని, నీటి వనరులను గుర్తించాలని ఆదేశించారు. ప్రజలకు నీటివినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బోర్లు, చేతి పంపులను మరమ్మతులు చేయాలన్నారు.
Similar News
News April 22, 2025
ADB: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ఆమీనా షిరీన్

ఆర్టీసీ కార్మికుడి కూతురు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. ADB RTCలో రీజినల్ ఆన్లైన్ రిజర్వేషన్ ఇన్‌ఛార్జ్‌గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ అహమ్మద్ హుస్సేన్ కూతురు ఆమీనా షిరీన్ సెకండియర్‌లో 99శాతం ఉత్తీర్ణత సాధించింది. బైపీసీ విభాగంలో 1000కి 990 మార్కులు సాధించింది. ఆమెకు కుటుంబ సభ్యులు, ఆర్టీసీ సిబ్బంది అభినందనలు తెలిపారు. మన ADB అమ్మాయికి CONGRATULATIONS చెప్పేయండి మరి.
News April 22, 2025
INTER RESULT: ఆదిలాబాద్ జిల్లాలో ఎంతమంది పాసయ్యారంటే?

ఇంటర్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 9,106 మంది విద్యార్థులు పరీక్షలు రాయంగా 4,967 మంది పాసయ్యారు. 54.55% మంది ఉతీర్ణత సాధించారు. సెకండియర్ ఇయర్‌లో 8,890 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 6,291 మంది పాసయ్యారు. 70.76% ఉతీర్ణత సాధించారు.
News April 22, 2025
ADB: హాల్ టికెట్లు వచ్చేశాయ్..!

తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయని బోథ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని విద్యార్థులను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ప్రవేశపరీక్ష వచ్చే ఆదివారం ఏప్రిల్ 27న ఉంటుందన్నారు. 6వ తరగతికి ఉదయం 10 నుంచి 12 వరకు, 7-10వ తరగతులకు మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఉంటుందని పేర్కొన్నారు.