News March 19, 2025

ఆన్‌లైన్‌ బెట్టింగ్లపై పటిష్ఠ నిఘా: ASF ఎస్పీ

image

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్‌లకు అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. మోసపూరితమైన సందేశాలను నమ్మి ఇతరులకు తమ వివరాలు ఇవ్వరాదని జిల్లా ప్రజలకు తెలిపారు. ఆన్‌లైన్‌లో డబ్బులు ఎక్కువ ఇస్తామని ఎవరైనా చెప్పితే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దన్నారు.

Similar News

News July 9, 2025

సైబర్ నేరాల నివారణకు చర్యలు: గుంటూరు ఎస్పీ

image

సైబర్ నేరాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. బుధవారం పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని బ్యాంకు మేనేజర్లతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలను అరికట్టడానికి పోలీసు శాఖ, బ్యాంకులు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ అన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు రమణమూర్తి, సుప్రజ, పలువురు బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.

News July 9, 2025

ఇందిరా మహిళా శక్తి పథకాన్ని విజయవంతం చేయండి: పెద్దపల్లి కలెక్టర్

image

జులై 7 నుంచి 18 వరకు జిల్లాలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలు జరగనున్నాయి. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాల్లో ఆరోగ్యం, అక్షరాస్యత, బీమా, జీవనోపాధులపై అవగాహన కల్పిస్తారు. సంఘాల్లో సభ్యత్వం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. మహిళలు చురుకుగా పాల్గొని ఇందిరా మహిళా శక్తి పథకాన్ని విజయవంతం చేయాలని బుధవారం కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు.

News July 9, 2025

HYD: BC బోనం పోస్టర్ ఆవిష్కరించిన చిరంజీవులు

image

42% బీసీ రిజర్వేషన్‌ను నోటిఫికేషన్‌తో వెంటనే అమలు చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నం, సుప్రీంకోర్టు 50% పరిమితి నిబంధనకు విరుద్ధమని BC ఇంటలెక్చువల్స్ ఫోరం ఛైర్మన్ (Retd IAS) చిరంజీవులు అన్నారు. OUలో BC బోనం పోస్టర్ ఆవిష్కరణలో భాగంగా కులగణన తర్వాత రిజర్వేషన్‌ను 68% పెంచితే పాట్నా హై కోర్టు కొట్టేసిన అనుభవం మన ముందుందని గుర్తు చేశారు.