News March 19, 2025
పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి: బాపట్ల కలెక్టర్

ఓటర్ల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు తక్షణమే పరిశీలించి, పరిష్కారం చూపాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆదేశించారు. మంగళవారం బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఓటు హక్కు కోసం జనవరి నుంచి ఇప్పటివరకు 2,399 దరఖాస్తులు రాగా, 382 పెండింగ్లో ఉన్నాయన్నారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు స్పృహతో పని చేయాలని హెచ్చరించారు.
Similar News
News November 6, 2025
క్వాయర్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకోండి: కలెక్టర్

క్వాయర్ పరిశ్రమల స్థాపనకు అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ప్రాంతీయ సదస్సును గురువారం కలెక్టర్ మహేష్ కుమార్ గురువారం నిర్వహించి మాట్లాడారు. కోనసీమ ప్రాంతంలో లక్ష ఎకరాల్లో కొబ్బరి సాగవుతుందన్నారు. కేవలం కొబ్బరికాయలు మాత్రమే విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. క్వాయర్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన వారు ముందుకు రావాలన్నారు.
News November 6, 2025
భీమవరం: మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

భీమవరం గునుపూడి పీఎస్ఎం బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను స్వయంగా రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. 936 విద్యార్థులు కలిగిన ఉన్నత పాఠశాలలో విద్యార్థులంతా వరుస క్రమంలో వచ్చి ఆహార పదార్థాలను వడ్డించుకుని భుజించడం సంతోషంగా ఉందన్నారు.
News November 6, 2025
ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి లాటరీ టికెట్ కొన్నాడు.. గెలవడంతో!

రాజస్థాన్‌లోని కోట్‌పూత్లీకి చెందిన కూరగాయల వ్యాపారి అమిత్ సెహ్రా ‘పంజాబ్ స్టేట్ దీపావళి బంపర్ లాటరీ- 2025’లో రూ.11 కోట్లు గెలుచుకున్నారు. లాటరీ టికెట్ కొనేందుకు డబ్బులు లేకపోవడంతో ఆయన తన ఫ్రెండ్ దగ్గర రూ.వెయ్యి అప్పుగా తీసుకున్నాడు. తాజాగా లాటరీ గెలవడంతో సెహ్రా కృతజ్ఞతగా స్నేహితుడి కుమార్తెకు రూ. కోటి బహుమతిగా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ డబ్బును ఇల్లు, పిల్లల విద్య, భవిష్యత్తు కోసం వాడతానన్నారు.


