News March 19, 2025
HYD గురించి చెప్పాలనుకుంటున్నారా?

స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే మొదలైంది. దేశంలోని వివిధ నగరాలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ అవార్డులు అందజేస్తోంది. ఈ సర్వేలో ప్రజలు పాల్గొని తమ నగరం గురించి అభిప్రాయాలు చెప్పవచ్చు. https ://sbmurban.org/feedback వెబ్‌సైట్ ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు. సర్వేలో పాల్గొనేందుకు ఈనెల 31 వరకు మాత్రమే అవకాశం. ఇప్పటికే దాదాపు 14వేల మంది నగరవాసులు సర్వేలో పాల్గొన్నారు. మరి ఇంకెందుకాలస్యం.. మీరు కూడా పాల్గొనండి.
Similar News
News March 2, 2026
ప్రశాంతంగా ముగిసిన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్ష

జిల్లావ్యాప్తంగా సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్షలు శాంతియుతంగా ముగిశాయని DEO ఎన్. ప్రేమకుమార్ తెలిపారు. మొత్తం 972 మంది అభ్యర్థులకు గాను 884 మంది హాజరు కాగా, 88 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన ఈ పరీక్షల కోసం 6 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన పేర్కొన్నారు
News March 2, 2026
కడప: గత నెలలో AMCల ఆదాయం ఎంతంటే.!

కడప జిల్లాలో 11 వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC)లు ఉన్నాయి. వీటిద్వారా గత నెలలో మార్కెట్ సెస్ రూపంలో రూ.1.55 కోట్లు ఆదాయం లభించింది.
AMCల వారీగా ఆదాయం రూ.లక్షల్లో ఇలా. కడప-18.95, ప్రొద్దుటూరు-20.35, బద్వేల్-29.77, జమ్మలమడుగు-16.64, పులివెందుల-15.48, రాజంపేట-2.80, మైదుకూరు-17.59, కమలాపురం-17.15, సిద్ధవటం-0.47, ఎర్రగుంట్ల-11.49, సింహాద్రిపురం-5.14 లక్షలు మార్కెట్ సెస్ రూపంలో వసూలైంది.
News March 2, 2026
కామారెడ్డి: పేదలకు ఒక న్యాయం… ఒవైసీ కాలేజీకి మరో న్యాయమా?: కేంద్ర మంత్రి

బఫర్ జోన్, FTL పేరుతో పేదల ఇండ్లు మీరు కూలిస్తే, అదే ప్రాంతంలోని పెద్దల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చి వేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైతే కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కామారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒవైసీ అక్రమంగా నిర్మించిన ఫాతిమా కాలేజీని కూల్చడానికి పరీక్షలు అడ్డు వస్తే, ఖమ్మంలో ఇంటర్ పరీక్షలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.


